మండుతున్న ఎండలతో సతమతమవుతున్న తెలంగాణ(telangana) ప్రజలకు ఓ చల్లటి వార్త. రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో పలు ప్రాంతాలలో వర్షాలు(Rains) పడే అవకాశం ఉందని వాతావరణశాఖ(IMD) తెలిపింది.
మండుతున్న ఎండలతో సతమతమవుతున్న తెలంగాణ(telangana) ప్రజలకు ఓ చల్లటి వార్త. రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో పలు ప్రాంతాలలో వర్షాలు(Rains) పడే అవకాశం ఉందని వాతావరణశాఖ(IMD) తెలిపింది. మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. 6వ తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుందని, ఈ నెల 7,8 తేదీలలో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్పింది. ఇదిలా ఉంటే తెలంగాణలో ఈ వేసవి(Summer) మహా భయంకరంగా ఉండబోతున్నదనడానికి సంకేతాలు వచ్చేశాయి. ఏప్రిల్ లోనే 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఖమ్మంతోపాటు భద్రాద్రి(Bhadradri) కొత్తగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగనున్నాయి. ఫలితంగా ఈ వేసవిలో ఎండలు విపరీతంగా ఉండబోతున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువ నమోదవుతున్నాయి.