మండుతున్న ఎండలతో (summer)అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ (IMD)ఓ చల్లటి కబరు చెప్పింది. ఆదివారం నుంచి తెలంగాణలో (telangana)అక్కడక్కడ వానలు (rains)పడతాయని తెలిపింది. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.
మండుతున్న ఎండలతో (summer)అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ (IMD)ఓ చల్లటి కబరు చెప్పింది. ఆదివారం నుంచి తెలంగాణలో (telangana)అక్కడక్కడ వానలు (rains)పడతాయని తెలిపింది. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో ఆదివారం వానలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. అయితే హైదరాబాద్ (Hyderabad)ప్రజలు మాత్రం మండిపోవాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్‌లో మాత్రం వానలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ స్పష్టంచేసింది.ఇదిలా ఉంటే తెలంగాణలో వచ్చే రెండు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు కూడా రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని చెబుతూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు బయటకు రాకూడదని సూచించింది. ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు తెలిపింది. శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని చెబుతూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మరోవైపు తీవ్రతరమైన ఎండలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆసుపత్రులలో డీ హైడ్రేషన్ కేసులు పెరుగుతున్నాయి. పిల్లలు, వృద్దులను జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. వాంతులు, విరేచనాలు వచ్చినప్పుడు పిల్లలను చల్లని ప్రదేశాల్లో ఉంచాలని సూచిస్తున్నారు.