ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే మహిళలకు ప్రభుత్వం ఒక ముఖ్య సూచన చేసింది. ఇక నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలనుకునేవారికి ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ గుర్తింపు కార్డు ఏదైనా ఈ స్కీంకు వర్తిస్తుందని తెలిపింది. అయితే గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించేలా ఉండాలని సూచించింది. అయితే.. పాన్‌ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది.

సంక్రాంతి రద్దీ(Sankranti rush)ని దృష్టిలో పెట్టుకొని మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ(RTC) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు గుర్తింపు కార్డులు (Identity cards)సరిగా చూపించడం లేదు. చాలా మంది స్మార్ట్‌ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్ లు చూపిస్తున్నారని కండక్టర్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ(Sankranti Festival) సమయంలో రద్దీని నియంత్రించాలని నిర్ణయించింది. ఇంక ముందు మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్‌ గుర్తింపు కార్డుల(Original Identity Cards)ను వెంట తెచ్చుకొని..కండక్టర్లు అడిగినప్పుడు చూపించాలని కోరింది. ఒరిజినల్‌ గుర్తింపు కార్డులేనివారు కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. అలాగే జీరో టిక్కెట్ తీసుకోవడం ఎందుకని కండక్టర్లతో వాదనకు దిగుతున్న ప్రయాణికులకు ఒక ముఖ్య సూచన చేసింది. జీరో టిక్కెట్ల ఆధారంగానే ప్రభుత్వం ఆర్టీసీకి ఆ మొత్తం రీయింబర్స్ చేస్తుందని, ప్రతి మహిళా కూడా జీరో టిక్కెట్ తీసుకొని సహకరించాలని కోరారు. ఒక వేళ టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే..కండక్టర్ ఉద్యోగం పోవడంతోపాటు సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం హెచ్చరించింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ టికెట్‌ తీసుకుని ఆర్టీసీకి సహకరించాలి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar) మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

Updated On 8 Jan 2024 6:10 AM GMT
Ehatv

Ehatv

Next Story