గ్రేటర్ హైదరాబాద్‌లో(Hyderabad) నకిలీ ట్రాన్స్‌జెండర్లు(Transgenders) మితిమీరుతున్నారు. ట్రాన్స్‌జెండర్ల వేషాల్లో సెంటర్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనదారులను బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్నారు. మగవాళ్లే ట్రాన్స్‌జెండర్లుగా తయారయ్యి ఓ ముఠాగా ఏర్పడి వసూళ్లకు పాల్పడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో(Hyderabad) నకిలీ ట్రాన్స్‌జెండర్లు(Transgenders) మితిమీరుతున్నారు. ట్రాన్స్‌జెండర్ల వేషాల్లో సెంటర్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనదారులను బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్నారు. మగవాళ్లే ట్రాన్స్‌జెండర్లుగా తయారయ్యి ఓ ముఠాగా ఏర్పడి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి బెగ్గింగ్ ముఠాను(Begging Gang) పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా బీహార్‌కు(Bihar) చెందిన వారని, నగరంలో ఇలాంటి వారు వందమందికి పైగానే ఉన్నారని వెస్ట్‌జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపారు. ఈ ముఠాకు రాజేష్, అనితలు లీడర్లుగా ఉన్నారని, రాజేష్ దగ్గర దాదాపు వంద వరకు సభ్యులు ఉన్నారని చందన దీప్తి అన్నారు.
వీరు పగలంతా ట్రాన్స్‌జెండర్‌ల వేషంలో ఉంటూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజుతుంటారు. సాయంత్రం కాలనీలు, కమర్షియల్ ఏరియాల్లో దోపిడీలకు పాల్పడుతుంటారు. సులభంగా డబ్బు సంపాదించడం కోసమే వారు ఈ గ్యాంగ్‌ను నడిపిస్తున్నారని చందన దీప్తి తెలిపారు. ఈ ముఠాలో మిగతా వారి కోసం వెతుకుతున్నామని అన్నారు. పగలంతా ప్రజలను బెదిరిస్తూ, వారిని ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు లాగుతున్న ఈ నకిలీ ట్రాన్స్‌జెండర్ల గురించి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు రంగంలోకి దిగారు. సికింద్రాబాద్(Secunderabad), ప్యారడైజ్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో వీరు హంగామా చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు.