కార్తీక మాసం ముగియడం, శీతాకాలంలో మంచు, చలి విపరీతంగా పెరగడంతో చికెన్ (Chicken), కోడిగుడ్ల (EGGs) ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం, కోళ్ల దాణా (Feed) ఖర్చులు పెరగడంతో ఈ ధరలు మరింత పెరిగాయి.

కార్తీక మాసం ముగియడం, శీతాకాలంలో మంచు, చలి విపరీతంగా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ (Chicken), కోడిగుడ్ల (EGGs) ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం, కోళ్ల దాణా (Feed) ఖర్చులు పెరగడంతో ఈ ధరలు మరింత పెరిగాయి. గత నెలలో 5.50 రూపాయిలున్న కోడిగుడ్డు ఇప్పుడు హోల్‌సేల్‌ మార్కెట్‌లో డజన్‌ (Dozen) కోడిగుడ్లు రూ.84కు పెరిగింది. రిటైల్ మార్కెట్‌లో ఏడు రూపాయలుకుపైగా కోడిగుడ్డుధర పెరిగింది. మరోవైపు చికెన్‌ కూడా గత నెలలో రూ.150-190 ఉండగా ఇప్పుడు దాదాపు రూ.240కి పెరిగింది. దాణాఖర్చులు అధికంగా పెరిగడమే ధరల పెరుగుదలకు కారణమని కోళ్ల ఫారంల (Poultry Form) నిర్వాహకులు చెప్తున్నారు.

Updated On 1 Jan 2024 10:32 PM GMT
Ehatv

Ehatv

Next Story