Ramakrishna Studio : రామకృష్ణ సినీ స్టూడియో వాణిజ్య సముదాయంగా ఎలా మారిందంటే....!
యాత్ర(Yatra) సినిమాల దర్శకుడు మహి.వి.రాఘవ్‌కు(Mahi.V.Raghav) ఏపీ ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని, అదీ మార్కెట్ రేటుకు, అది కూడా మదనపల్లెలోని హార్సిహిల్స్‌లో ఇచ్చినందుకు ఓ వర్గం మీడియా చొక్కాలు చించేసుకుని, రక్త కన్నీరు కార్చేసుకుని, అన్యాయం అక్రమం అంటూ గొంతు చించుకుని కరాళ నృత్యం చేసిన విషయం తెలిసిందే కదా! మరి తెలుగుదేశంపార్టీ(TDP) ప్రభుత్వంలో ఎవరికెన్ని భూములు కేటాయించారో చిట్టా తీసి వారి నిజాయితీని రుజువు చేసుకుంటే మంచిది కదా! గణంకాలు చెప్పడంలో ఎక్స్‌పర్ట్ అయిన ఆ మీడియా ఇప్పుడా లెక్కలు చెప్పవచ్చు కదా! చెప్పదు.. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో లబ్ధి పొందిన వారంతా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కాబట్టి! సరే ప్రభుత్వం నుంచి నామమాత్రం ధరతో తీసుకున్న భూములను ఏం చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే! బంజారాహిల్స్ మెయిన్‌రోడ్డు మీద ఉన్న భూమిని దర్శకేంద్రుడుగా చెప్పుకుంటున్న రాఘవేంద్రరావు ఏం చేశారో చూస్తున్నాం కదా! ఇలాంటివి చాలానే జరిగాయి.

అప్పుడు హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఉదారంగా భూములు ఇచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. నాగేశ్వరరావు(Banjarahills) బంజారాహిల్స్‌లో స్థలం తీసుకుంటే ఎన్టీఆర్ ఏమో తెలివిగా ముషీరాబాద్ దగ్గర తీసుకున్నారు. అప్పటికే ముషీరాబాద్ బాగా డెవలప్పయ్యింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు చాలా దగ్గర. ఎన్టీఆర్‌కు ఇచ్చిన స్థలం పక్కనే పెద్ద క్రిస్టియన్ స్కూల్ ఉండింది. ఆ చౌరస్తాలో థియేటర్లు ఉన్నాయి. కేఫ్‌లు ఉన్నాయి. గోల్కొండ అనే సిగరేట్ ఫ్యాక్టరీ కూడా ఉండింది. అక్కడే ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్‌ను(Rama Krishna Studios) నిర్మించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక నాచారంలో రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియో నిర్మించారు.
మరి ముషీరాబాద్‌లో ఉన్న స్టూడియోను ఏం చేయాలి? నిజానికి ప్రభుత్వం దగ్గర చౌకధరకు తీసుకున్న భూమిని వాణిజ్యం కోసం ఉపయోగించకూడదు. ఆ భూమితో వ్యాపారం చేయకూడదు. కానీ రామకృష్ణ సినీ స్టూడియోను వాణిజ్యపరంగా వాడుకున్నారు. చిత్రమేమిటంటే దాన్ని వాణిజ్యపరంగా వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ స్టూడియో అధినేతగా ఉన్న ఎన్టీఆర్, ఎన్టీఆర్ ప్రభుత్వానికి లేఖ రాయడం. ముషీరాబాద్ స్టూడియో ప్లేస్‌ను వాణిజ్య సముదాయాలను నిర్మించడానికి అనుమతినిస్తే నాచారంలో స్టూడియో కడతానని ఎన్టీఆర్ లేఖ రాశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఎన్టీఆర్ అనుమతి ఇచ్చేశారు. బహు విచిత్రంగా ఉంది కదూ! సినిమాల్లో చాలా సినిమాల్లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు కదా! నిజ జీవితంలో కూడా అలాగే డబుల్ యాక్షన్ చేశారన్నమాట! అప్పడు ఈ తతంగాన్ని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్(Congress) పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.
తప్పుపట్టింది. ఆంధ్రభూమి పేపర్‌లోనే ఇలాంటి వార్తలు వచ్చేవి. టీడీపీ అనుకూల మీడియాలో ఇలాంటి న్యూస్ అసలు వచ్చేవి కావు. సరే, ముషీరాబాద్‌లోని స్టూడియోను షాపింగ్ కాంప్లెక్స్ మార్చేశారు. అప్పట్లో దాన్ని ఆర్కే కాంప్లెక్స్(RK Complex) అనేవారు. తర్వాత ఆస్తి పంపకాలలో ఇది ఎన్టీఆర్ కుమారుల్లోని ఓ కుమారుడికి వెళ్లింది. దాన్ని అతడు అమ్ముతుంటే మరో కొడుకు బాలకృష్ణ కొన్నాడు. తర్వాత రోడ్ వైడ్‌నింగ్‌లో కొంత ప్లేస్ పోయింది. మిగిలిన భాగంలో పెద్ద బిల్డింగ్‌కే కట్టాడు బాలకృష్ణ. దాన్ని ఓ కాలేజీకి రెంట్‌కు ఇచ్చాడు. మహి.వి.రాఘవ మీద శోకాలు, పెడబొబ్బలు పెట్టుకుంటున్న మీడియాకు ఇది మాత్రం కనిపించదు. కొసమెరుపు ఏమిటంటే రోడ్ వైడ్‌నింగ్‌లో జాగా పోయినందుకు నాటి సీఎం కేసీఆర్‌ను కలిసి మరో దగ్గర జాగా ఇవ్వమని బాలకృష్ణ(Balakrishna) రిక్వెస్ట్ చేయడం.