బంగారం మన జీవితంలో అంతర్భాగం. అనుబంధమై పెనవేసుకపోయింది. ఏ విషయాన్ని తల్చుకున్నా బంగారంతో పోల్చుకోవడం ఆనవాయితీగా మారింది. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అనుకుంటాం. ఆ కాలం స్వర్ణయుగమమ్మా... అంటూ తలపోస్తాం. లేదా బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటాం. సువర్ణావకాశం వదులుకోకండి అంటూ హితవుచెబుతాం.

బంగారం మన జీవితంలో అంతర్భాగం. అనుబంధమై పెనవేసుకపోయింది. ఏ విషయాన్ని తల్చుకున్నా బంగారంతో పోల్చుకోవడం ఆనవాయితీగా మారింది. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అనుకుంటాం. ఆ కాలం స్వర్ణయుగమమ్మా... అంటూ తలపోస్తాం. లేదా బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటాం. సువర్ణావకాశం వదులుకోకండి అంటూ హితవుచెబుతాం. బంగారంలాంటి మనిషి అని కితాబిస్తాం. నీ ఇల్లు బంగారంగానూ అంటూ హాస్యమాడుతాం! ఇలా బంగారు బంధంతో మన జీవితం ముడివేసుకుపోయింది. మనకు బంగారం ఓ ఆభరణమే కాదు, పెట్టుబడి సాధనం కూడా! బంగారం మనకు లక్ష్మీదేవి. అందుకే మనం బంగారాన్ని భద్రంగా లాకర్లలో, బీరువాలో దాచుకుంటాం! అయితే మన దగ్గర ఉంది కదాని ఎంతపడితే అంత బంగారాన్ని ఉంచుకోలేం! ఎంతుండాలన్నది ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) చెబుతున్నది. ఐటీశాఖ అధికారులు దాడులు చేస్తున్న సమయాల్లో ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసేసుకుంటున్నారు. సీబీడీటీ సర్క్యూలర్‌(CBDT Circulars) ప్రకారం పరిమితికి లోబడి ఉన్న బంగారం జోలికి ఐటీ శాఖ వెళ్లకూడదు. అధికారులు జులుం చేయడానికి వీల్లేదు. పెళ్లయిన మహిళల దగ్గర 500 గ్రాముల వరకు అంటే 50 తులాల వరకు బంగారం ఉండొచ్చు. పెళ్లికాని మహిళల దగ్గర 250 గ్రాముల బంగారం అంటే పాతిక తులాల వరకు బంగారం ఉండొచ్చు. మగవారి విషయానికి వస్తే పది తులాల వరకు ఉండొచ్చు. ఐటీ సోదాలలో ఆయా వ్యక్తులకు సంబంధించిన బంగారం దొరికితే అధికారులు వదిలేయాలి తప్ప సీజ్‌ చేసే అధికారం లేదు. ఈ బంగారానికి ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోయినా దాని జోలికి వెళ్లకూడదు. అయితే ఈ నిబంధనలు కేవలం ఆభరణాల రూపంలో ఉన్న బంగారానికి మాత్రమే వర్తిస్తాయి. బిస్కట్లు, కడ్డీల రూపంలో బంగారానికి సంబంధించి సీబీడీటీ ఎలాంటి సూచనలు చేయలేదన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ ఎవరికైనా తమ తాత, ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా, వారసత్వ సంపదగా పెద్ద ఎత్తున బంగారు అభరణాలు వస్తే ఎలా అన్న అనుమానం అక్కర్లేదు. వాటికి సంబంధించిన రుజువులు చూపిస్తే సరి! అవి సరైనవేనని తేలితే వాటిని అధికారులు సీజ్‌ చేయలేరు. సరైన రుజువులు లేకపోతే మాత్రం జప్తు చేస్తారు. తర్వాత అయినా మనం తగిన సాక్ష్యాలు చూపించుకోగలిగితే వాటిని విడిపించుకోవచ్చు.

Updated On 17 May 2024 5:12 AM GMT
Ehatv

Ehatv

Next Story