తెలంగాణలో ఎంపీ ఎన్నికలపై న్యూస్ 24 ఛానల్ (News 24) ఓ సర్వేను వెల్లడించింది.  ఎంపీ ఎన్నికల్లో 40శాతం ఓట్లతో 8 సీట్లను బీఆర్‌ఎస్‌ (BRS) కైవసం చేసుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. 28 శాతం ఓట్లతో 6 స్థానాలను బీజేపీ (BJP) కైవసం చేసుకుంటుందని తెలిపింది. 23 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ (Congress) కేవలం 2 సీట్లను మాత్రమే గెలుస్తుందని తెలిపింది

తెలంగాణలో ఎంపీ ఎన్నికలపై న్యూస్ 24 ఛానల్ (News 24) ఓ సర్వేను వెల్లడించింది. ఎంపీ ఎన్నికల్లో 40శాతం ఓట్లతో 8 సీట్లను బీఆర్‌ఎస్‌ (BRS) కైవసం చేసుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. 28 శాతం ఓట్లతో 6 స్థానాలను బీజేపీ (BJP) కైవసం చేసుకుంటుందని తెలిపింది. 23 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ (Congress) కేవలం 2 సీట్లను మాత్రమే గెలుస్తుందని తెలిపింది. 3శాతం ఓట్లతో ఎంఐఎం (MIM) ఒక స్థానాన్ని గెలుచుకుంటుందని న్యూస్ 24 చానెల్ వెల్లడించింది. అయితే న్యూస్‌ చానల్‌ సర్వే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా సర్వే నిర్వహించగా అప్పుడు కాంగ్రెస్‌కు 61-67 స్థానాలు వస్తాయని.. బీఆర్‌ఎస్‌కు 45-51 స్థానాలు బీజేపీ 2-3 నుంచి ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తుందని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పూర్తిగా చతికలలపడిపోయిందని బీఆర్‌ఎస్‌కు ఒక్క స్థానం కూడా రాదని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ వాదించాయి. అయితే అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ పుంజుకొని 8 స్థానాలతో సింగిల్‌ లార్జెస్ట్ పార్టీగా బీఆర్‌ఎస్ అవతరిస్తుందని సర్వే వెల్లడించంతో రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ సక్సెస్‌ కాలేకపోవడం, రేవంత్‌ (Revanth Reddy) వ్యవహారశైలి, ప్రసంగాల్లో ఆయన మాట్లాడే తీరు కూడా ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రోడ్‌ షో (KCR Road Show), బలమైన ప్రతిపక్షంగా ఉండాలన్న వాదనలతో తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నారని పొలిటికల్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Updated On 29 April 2024 4:55 AM GMT
Ehatv

Ehatv

Next Story