Holy Sepulcher Church : ముస్లిం కుటుంబ పెద్ద చేతిలో ఆ చర్చి తాళాలు
ప్రార్థనామందిరాలపైనా దాడులు చేయడం, ధ్వంసం చేయడం అనాగరికమే! ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవాళ్లు జెరూసలెంలోని(Jerusalem) హోలీసెపల్కర్ చర్చికి(Holy Sepulcher Church) వెళితే కాసింత బుద్ధయినా వస్తుంది.. ఈ ప్రార్థనామందిరం ప్రపంచంలోని క్రైస్తవులందరికీ(Christians) ఎంతో ఎంతో పవిత్రం. కారణం, ఏసుక్రీస్తు సమాధి(Jesus Grave) ఈ చర్చిలోనే భద్రపరిచారన్న నమ్మకం. ఏడాది కిందట సమాధి ఉన్నట్లుగా భావిస్తున్న స్థలాన్ని పునరుద్ధరించారు కూడా! ఈ విషయం అలా ఉంచితే, ఈ చర్చి సంరక్షణా విధులను నిర్వర్తిస్తోంది ఓ ముస్లిం కుటుంబం(Muslim Family).
ప్రార్థనామందిరాలపైనా దాడులు చేయడం, ధ్వంసం చేయడం అనాగరికమే! ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవాళ్లు జెరూసలెంలోని(Jerusalem) హోలీసెపల్కర్ చర్చికి(Holy Sepulcher Church) వెళితే కాసింత బుద్ధయినా వస్తుంది.. ఈ ప్రార్థనామందిరం ప్రపంచంలోని క్రైస్తవులందరికీ(Christians) ఎంతో ఎంతో పవిత్రం. కారణం, ఏసుక్రీస్తు సమాధి(Jesus Grave) ఈ చర్చిలోనే భద్రపరిచారన్న నమ్మకం. ఏడాది కిందట సమాధి ఉన్నట్లుగా భావిస్తున్న స్థలాన్ని పునరుద్ధరించారు కూడా! ఈ విషయం అలా ఉంచితే, ఈ చర్చి సంరక్షణా విధులను నిర్వర్తిస్తోంది ఓ ముస్లిం కుటుంబం(Muslim Family). దాదాపు ఎనిమిది శతాబ్దాల నుంచి చర్చి సంరక్షణా బాధ్యతలను ఈ ముస్లిం కుటుంబమే చూస్తోంది. చర్చికున్న ప్రధాన ద్వారం తాళం(Main Door Keys) చెవి ఈ ముస్లిం కుటుంబం దగ్గరే ఉంటుంది. ప్రస్తుతం ఆ ఫ్యామిలీలోని 80వ తరానికి చెందిన అదీబ్ జౌదే దగ్గర ఈ తాళం చెవి ఉంది.. ప్రతి రోజూ చర్చి తలుపులు తెరవడం ఈయన విధి! అలాగే తలుపులు మూసి తాళం వేయడం కూడా ఈయన డ్యూటీనే! ఏరోజూ వీళ్లు తమ బాధ్యతలను విస్మరించలేదు. కొన్ని వందల ఏళ్ల కిందట ఈ చర్చి నిర్వాహణ క్రైస్తువుల చేతుల్లోనే ఉండేది. కాకపోతే క్రైస్తవులలో ఆర్మేనియన్, గ్రీక్, ఫ్రాన్సిస్కాన్‌లు ఉండేవారు. ఇలాగైతే లాభం లేదని చర్చి సంరక్షణ బాధ్యతలను తటస్థ వ్యక్తికి అప్పగిస్తే బాగుంటుందని అనుకున్నారు.వెంటనే ఎంతో ప్రజాభిమానం కలిగిన ఓ ముస్లిం పెద్దకు ఆ బాధ్యతలను అప్పగించారు.. అప్పటి నుంచి చర్చి ప్రధాన ద్వారం తాళం చెవి ఈ ముస్లిం కుటుంబం దగ్గరే ఉంటూ వస్తోంది.. అదన్నమాట సంగతి!