No ticket for Gorantla Madhav: హిందూపురంలో గోరంట్లకు చెక్..ప్రత్యామ్నాయం ఎవరు?
ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇంఛార్జీల మార్పు ప్రక్రియ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్..11 మందితో మొదటి జాబితా విడుదల చేసి, వైసీపీ సిట్టింగులకు షాక్ ఇచ్చారు. ఇక తాజాగా రెండో జాబితాకు కసరత్తు చేస్తున్న క్రమంలో వైసీపీ అధిష్టానం అనంతపురం జిల్లాపై ఫోకస్ పెట్టింది. హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ కు ఈసారి టిక్కెట్ లేనట్టేనని ప్రచారం జరుగుతోంది.
ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్(Ysrcp) పార్టీలో ఇంఛార్జీల మార్పు ప్రక్రియ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్(cm Jagana)..11 మందితో మొదటి జాబితా విడుదల చేసి, వైసీపీ సిట్టింగులకు షాక్ ఇచ్చారు. ఇక తాజాగా రెండో జాబితాకు కసరత్తు చేస్తున్న క్రమంలో వైసీపీ అధిష్టానం అనంతపురం జిల్లాపై ఫోకస్ పెట్టింది. హిందూపురం ఎంపీ(Hindupuram Mp)గా ఉన్న గోరంట్ల మాధవ్(Gorantla Madhav) కు ఈసారి టిక్కెట్ లేనట్టేనని ప్రచారం జరుగుతోంది. హిందూపురం లోక్ సభ పరిధిలో కురుబల జనాభా ఎక్కువ. పెనుకొండ(Penugonda) నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గిన కురుబ సామాజికవర్గానికి చెందిన శంకర్ నారాయణ(shankar narayana)ను.. ఈసారి హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కల్యాణదుర్గంలో గెలిచిన మంత్రి ఉషశ్రీ చరణ్(Minister Ushasree Charan)ను పెనుగొండకు మారుస్తున్నట్టు సమాచారం. ఈసారి మంత్రి ఉషశ్రీ కల్యాణదుర్గం(Kalyanadurgam)లో గెలవడం కష్టమనే అంచనాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెనుకొండ నుంచి గత ఎన్నికల్లో నెగ్గిన శంకర్ నారాయణకు జగన్ కేబినెట్ లో స్థానం కల్పించారు. కేబినెట్లో మార్పుచేర్పుల్లో భాగంగా జగన్ తొలగించారు. మారుతున్న రాజకీయ సమీకరణలో భాగంగా గతంలో హిందూపురం నుంచి నెగ్గిన గోరంట్ల మాధవ్(Gorantla Madhav)కు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. శంకర్ నారాయణ కూడా కురుబ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మాధవ్‌కు ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నారట. గోరంట్ల స్థానంలోనే శంకర్ నారాయణ(shankar narayana)ను ఎంపీగా పోటీ చేయించే అవకాశాలున్నట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హిందూపురం నుంచి శంకర్ నారాయణను పోటీ చేయించడం వల్ల కురుబలకు అదే ప్రాధాన్యత కొనసాగించినట్టు అవుతుందనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. మరి..ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ గోరట్ల మాధవ్ భవితవ్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. గోరంట్లకు మరేదైనా అవకాశం కల్పిస్తారా? ఈసారికి పూర్తిగా పక్కన పెడతారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.