తెలంగాణలో కానిస్టేబుల్‌ ఉద్యోగాల నియామకాల (constable jobs Recruitmen)కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టులో ఉన్న వివాదానికి తెరదించి..ఉద్యోగాల భర్తీకి అడ్డంకులను తొలగిస్తూ తీర్పు వెలువరించింది.

తెలంగాణలో కానిస్టేబుల్‌ ఉద్యోగాల నియామకాల (constable jobs Recruitmen)కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టులో ఉన్న వివాదానికి తెరదించి..ఉద్యోగాల భర్తీకి అడ్డంకులను తొలగిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో త్వరలోనే 15 వేల 640 కానిస్టేబుల్‌ పోస్టులు(constable posts) భర్తీ కానున్నాయి. ఇప్పటికే పరీక్షలు పూర్తి ఐనప్పటికీ.. ప్రశ్నలు తప్పుగా వచ్చాయని కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. పరీక్షల్లో 4 మార్కులు కలపాలంటూ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం(Single Bench Tribunal) సానుకూలంగా తీర్పునిచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ 4 మార్కులు కలపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే సింగిల్‌ బెంచ్‌ తీర్పుకు వ్యతిరేకంగా మరికొందరు అభ్యర్థులు పిటీషన్ వేశారు. దీంతో ఈ పిటిషన్‌ను డివిజన్‌ బెంచ్‌(Division branch) స్వీకరించింది. ఈ వ్యవహారం హైకోర్టులో ఉండటంతో నియామకాలకు అప్పట్లో బ్రేక్‌ పడింది. ఈ పిటిషన్‌ను ఇప్పుడు విచారించిన డివిజన్‌ బెంచ్‌.. సింగిల్‌ బెంచ్‌ తీర్పును తప్పుబట్టింది. మార్కులు కలపాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెప్పింది. పరీక్షల్లో తప్పులు దొర్లాయన్న విషయంలో ఎక్స్‌పర్ట్‌ కమిటీ(Expert Committee)తో విచారణ చేయించాలని ఆదేశించింది. దీనికోసం త్వరలోనే కమిటీ ఏర్పాటు కానుంది. విచారణ పూర్తయ్యాక 4 వారాల్లో ఉద్యోగాల భర్తీని పూర్తి చేయాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హోల్డ్‌లో ఉన్న ఉద్యోగాలన్నీ ఇప్పుడు భర్తీ కానున్నట్లు తెలుస్తోంది. హైకోర్ట్‌ తీర్పుపై కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated On 4 Jan 2024 10:52 AM GMT
Ehatv

Ehatv

Next Story