గొప్ప ప్రేమకథలన్నీ(Love story) విషాదాంతాలే! ఆ ప్రేమకథలు కన్నీళ్లు పెట్టిస్తాయి. ఇప్పుడు అలాంటి హృద్యమైన ప్రేమ కథ సోషల్‌ మీడియాలో(Social media) వైరల్‌ అవుతూ కళ్లు చెమ్మగిల్లేలా చేస్తున్నది. తెలియని భావోద్వేగానికి గురి చేస్తున్నది. ప్రేమికులందరిలాగే ఈ జంట కూడా ఎన్నో ఊసులు చెప్పుకుంది. ఎన్నో బాసలు చేసుకుంది. జీవితం ఆనందమయం అవుతుందని ఆశపడింది. ఆ ఆశ నెరవేర్చుకోవడానికి ప్రేయసీ ప్రేమికులు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.

గొప్ప ప్రేమకథలన్నీ(Love story) విషాదాంతాలే! ఆ ప్రేమకథలు కన్నీళ్లు పెట్టిస్తాయి. ఇప్పుడు అలాంటి హృద్యమైన ప్రేమ కథ సోషల్‌ మీడియాలో(Social media) వైరల్‌ అవుతూ కళ్లు చెమ్మగిల్లేలా చేస్తున్నది. తెలియని భావోద్వేగానికి గురి చేస్తున్నది. ప్రేమికులందరిలాగే ఈ జంట కూడా ఎన్నో ఊసులు చెప్పుకుంది. ఎన్నో బాసలు చేసుకుంది. జీవితం ఆనందమయం అవుతుందని ఆశపడింది. ఆ ఆశ నెరవేర్చుకోవడానికి ప్రేయసీ ప్రేమికులు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వారి ఆనందం చూసి విధికి కన్నుకుట్టింది. అన్ని ప్రణయగాధల్లాగే దీన్ని విషాదాంతం చేసింది. కథలోకి వెళితే, 2015లో హీథర్‌(Hithar), డేవిడ్‌(David) మోషెర్‌ ఓ స్వింగ్‌ డాన్స్‌ క్లాస్‌లో కలుసుకున్నారు. మొదట చూపులు కలిశాయి. తర్వాత మాటలు కలిశాయి. ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది. కొన్ని నెలలపాటు డేటింగ్‌లో ఉండి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. బంధు మిత్రుల మధ్య ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. 2017, డిసెంబర్‌ 30న పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. ఇక్కడే కథ మలుపుతిరిగింది. హీథర్‌కు అత్యంత ప్రమాదకరమైన ట్రిపుల్‌-నెగటివ్‌ రొమ్ము క్యాన్సర్‌(Triple-negative breast cancer) అని తేలింది. వైద్య పరీక్షలు, కీమోథెరపీలతో హాస్పిటల్‌ చుట్టూ తిరిగారు. తను ప్రాణప్రదంగా ప్రేమించిన ప్రేయసి హాస్పిటల్‌లో చావుబతుకుల మధ్య పోరాటం సాగించడం చూసి డేవిడ్‌ మోషెర్‌ తట్టుకోలేకపోయాడు. దు:ఖాన్ని దిగమింగుకుంటూ ఆసుపత్రి బెడ్‌పైనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మరణానికి చేరువైన హీథర్‌ చివరి కోరిక అది. హాస్పిటల్‌ సిబ్బంది, కుటుంబసభ్యుల సమక్షంలో ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సరిగ్గా ఏడాది తర్వాత! క్యాన్సర్‌ దేహంతట పాకిపోయిందని ఆమెకు తెలుసు. పంటిబిగువున బాధను భరిస్తూ , శరీరం సహకరించకపోయినా భర్తగా మారిన ప్రియుడిని ఆత్మీయంగా, ప్రేమగా ఆలింగనం చేసుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కంటతడి పెట్టారు. దేవుడెంత నిర్దయడు అని తిట్టుకున్నారు. ఇది జరిగిన 18 గంటల తర్వాత హీథర్‌ ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది. మరో విషాదమేమిటంటే, ఏ రోజు అయితే పెళ్లి చేసుకోవాలనుకున్నారో అదే డిసెంబర్‌ 30వ తేదీన ప్లాంట్స్‌విల్లే కాంగ్రెగేషనల్‌ చర్చిలో(Plantsville Congregational Church) హీథర్‌ అంత్యక్రియలు జరగడం!
నాన్‌ ఈస్తటిక్‌ థింక్స్‌ అనే ట్విటర్‌ హ్యాండిల్‌ ఈ విషాదగాథను ట్విటర్‌లో మళ్లీ షేర్‌ చేసింది. ఇప్పటికే మిలియన్ల వ్యూస్‌ను సంపాదించింది..

Updated On 30 Jan 2024 4:50 AM GMT
Ehatv

Ehatv

Next Story