Roja and Ambati : మంత్రి రోజా, అంబటి రాంబాబులకు టికెట్ కష్టమే!
ఆంధప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(Jagan mohan reddy) కీలకమైన నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. తద్వారా ఎన్నికలకు సంసిద్ధమవుతున్నారు. తెలంగాణలో(Telangana) విపరీతమైన ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్న ఎమ్మెల్యేలను(MLA) మార్చకుండా అధికార బీఆర్‌ఎస్(BRS) పార్టీ పెద్ద తప్పిదం చేసిందంటూ విశ్లేషకులు చేస్తున్న వ్యాఖ్యానాలతో జగన్ అలెర్టయ్యారో లేకపోతే తన వ్యూహంలో భాగంగానో తెలియదు కానీ ఒకేసారి 11 మంది ఇన్‌ఛార్జ్‌లను(Incharges) మార్చేశారు. ఇంకా కొందరికి తాఖీదులు అందే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సమాచారం అందుకున్న వారిలో కొందరు మంత్రులు(Ministers) కూడా ఉన్నారని వినికిడి.
ఆంధప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(Jagan mohan reddy) కీలకమైన నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. తద్వారా ఎన్నికలకు సంసిద్ధమవుతున్నారు. తెలంగాణలో(Telangana) విపరీతమైన ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్న ఎమ్మెల్యేలను(MLA) మార్చకుండా అధికార బీఆర్‌ఎస్(BRS) పార్టీ పెద్ద తప్పిదం చేసిందంటూ విశ్లేషకులు చేస్తున్న వ్యాఖ్యానాలతో జగన్ అలెర్టయ్యారో లేకపోతే తన వ్యూహంలో భాగంగానో తెలియదు కానీ ఒకేసారి 11 మంది ఇన్‌ఛార్జ్‌లను(Incharges) మార్చేశారు. ఇంకా కొందరికి తాఖీదులు అందే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సమాచారం అందుకున్న వారిలో కొందరు మంత్రులు(Ministers) కూడా ఉన్నారని వినికిడి. ఓ 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ (Ticket)దొరకడం అనుమానమే! ఈ చిట్టాలో పది మంది మంత్రులు కూడా ఉన్నారు. వీరిలో నగరి ఎమ్మెల్యే రోజా(Roja) కూడా ఉన్నారట! ఇప్పటికే రోజాకి సమాచారం కూడా ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వై నాట్ 175 అంటున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అందుకోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. జనంలో బాగా పాపులర్ అయిన రోజా, అంబటి రాంబాబు(Ambati Rambabu) లాంటి మంత్రులను కూడా పక్కన పెట్టాలని జగన్ అనుకుంటున్నారట! కొందరు సీనియర్ మంత్రులను లోక్‌సభ(Lok Sabha) స్థానాలకు పోటీ చేయించాలని భావిస్తున్నారట! రోజాకు ముఖ్యమంత్రి జగన్ మొదటి విడతలో మంత్రి పదవి ఇవ్వలేదు. అయితే పాపులారిటీ(Popularity) విషయంలో ఆమెకు మంచి మార్కులే పడతాయి. జబర్బస్థ్ షో(Jabardast show) కారణంగా ఆమె రెండు తెలుగు రాష్ట్రాలలో పాపులయ్యారు. పాపులారిటీ వున్న రోజాను కాదనడం ఎందుకని, రెండోసారి కేబినెట్(Cabinet) విస్తరణలో అవకాశం ఇచ్చారు జగన్. అయితే సొంత నియోజకవర్గం నగరిలో మాత్రం రోజా ప్రజలకు దూరమయ్యారనే ప్రచారం జరుగుతోంది. పైగా స్థానిక వైసీపీ నాయకులు రోజా అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోవడం లేదట! నియోజకవర్గంలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉందట! రోజా మాత్రం తనకు నగరిలో(Nagari) తిరుగులేదని చెబుతున్నారు. ప్రజలలో, కార్యకర్తలలో అసంతృప్తి ఉందన్న విషయాన్ని ఆమె ఒప్పుకోవడం లేదు. అయినప్పటికీ ఆమెకు ఈసారి వైసీపీ టిక్కెట్ ఇవ్వడం కష్టమేనని అంటున్నారు.
మంత్రి అంబటి రాంబాబుది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి, ప్రత్యర్థులపై(Opponents) మాటలతో దాడి చేయడంలో రాంబాబుకు మించిన వారు లేరు. మంచి మాటకారి. కానీ సొంత జిల్లాలో మాత్రం ఆయనపై వ్యతిరేకత ఉంది. సత్తెనపల్లిలో(Sattenapally) ఆయనపై ప్రజలు ఎదురు తిరిగిన సంఘటనలు కూడా జరిగాయి. జగన్‌పై ఆయనకు విధేయత ఉన్నప్పటికీ జిల్లాలో పార్టీని నడిపించలేకపోతున్నారని చెబుతున్నారు. అందుకే ఈసారి అంబటి రాంబాబును పక్కన పెట్టాలని అధిష్టానం డిసైడ్ అయ్యిందట. అధినాయకత్వం ప్రపోజల్ కు రాంబాబు కూడా తలూపారట!