ఎన్నికలకు ముందే గుంటూరు పశ్చిమలో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇక్కడ సిట్టింగ్‎ అభ్యర్థిని కాదని మంత్రి విడుదల రజనీకి ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించారు. దీంతో మంత్రి రజనీ తాజాగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పొత్తులో వెళ్దామని భావిస్తున్న టీడీపీ, జనసేన..గుంటూరు పశ్చిమ టిక్కెట్ తమకే కావాలంటూ పట్టుబడుతున్నాయి. దీంతో ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనేదానికి క్లారిటీ లేకుండాపోయింది.

ఎన్నికలకు ముందే గుంటూరు పశ్చిమలో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇక్కడ సిట్టింగ్‎ అభ్యర్థిని కాదని మంత్రి విడుదల రజనీకి ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించారు. దీంతో మంత్రి రజనీ తాజాగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పొత్తులో వెళ్దామని భావిస్తున్న టీడీపీ, జనసేన..గుంటూరు పశ్చిమ టిక్కెట్ తమకే కావాలంటూ పట్టుబడుతున్నాయి. దీంతో ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనేదానికి క్లారిటీ లేకుండాపోయింది.

ఎన్నికలకు ముందే గుంటూరులో అధికార వైసీపీ దూకుడు పెంచింది. గుంటూరు వెస్ట్‌(Guntur West)లో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలి గిరి(MLA Maddali Giri)ని మార్చి..ఇంఛార్జీ బాధ్యతలను మంత్రి విడదల రజని(minister vidadala Rajini)కి అప్పగించారు సీఎం జగన్(cm jagan). దీంతో నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు మంత్రి విడుదల రజనీ. ఎమ్మెల్యే మద్దాలిగిరి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి(Mlc appireddy), ఏసురత్నం(Aesuratnam), మేయర్ కావేటి మనోహర్‌నాయుడు(Mayor Kaveti Manoharnaidu) ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు మంత్రి రజిని. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో 25 డివిజన్లు ఉండగా… ప్రతిరోజు నాలుగైదు డివిజన్‌ల అధ్యక్షులు, కార్పొరేటర్లతో సమావేశాలు నిర్వహిస్తు్న్నారు. ఇక..గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి అడ్డాగా ఉంది. 2009లో ఒక్కసారి మాత్రమే కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత నుంచి వరుసగా టీడీపీనే గెలుస్తోంది. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన మద్దాళి గిరి వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఈసారి మద్దాళికి టిక్కెట్ ఇవ్వడం లేదని అధిష్టానం తేల్చేయడంతో ఆయన సామాజికవర్గమైన ఆర్యవైశ్యులు..వైసీపీ అధినేత జగన్ పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్యవైశ్యులు ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. గుంటూరు పశ్చిమలో బీసీ ఓటర్లు ఎక్కువ. అందుకే రజనీకి ఈ స్థానం కేటాయించినట్టు సమాచారం. అయితే గత ఎన్నికల్లోనూ బీసీ కార్డు(Bc card) ఉపయోగించినా వైసీపీకి ఫలితం దక్కలేదు. ఇక్కడ వైసీపీ నుంచి బరిలో నిలిచిన చంద్రగిరి ఏసురత్నం(Chandragiri Esuratnam) ఓటమిపాలయ్యారు. కానీ..ఈసారి ఎలాగైనా గుంటూరు పశ్చిమలో జోణీ కొట్టాలని వైసీపీ అధిష్టానం కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. అయితే ఈ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట అని తెలిసిన కూడా ఇక్కడకు మారడం రజిని సెల్ఫ్ గోల్ చేసుకోవడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు గుంటూరు పశ్చిమ టిక్కెట్ తమకే కేటాయించాలని టీడీపీ-జనసేన పట్టుబడుతున్నాయట. జనసేనకు అవకాశమిస్తే బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ (Bonaboyna Srinivas Yadav) పోటీ చేస్తారని సమాచారం. అయితే సీట్లు సర్దుబాటు జరిగితే తప్ప..ప్రతిపక్షాల నుంచి ఎవరు పోటీ చేస్తారనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Updated On 8 Jan 2024 2:49 AM GMT
Ehatv

Ehatv

Next Story