Gun Firing in Pulivendula : పులివెందులలో కాల్పుల కలకలం, ఒకరి మృతి..
కడప జిల్లా పులివెందులలో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. భరత్‌కుమార్ యాదవ్ అనే దిలీప్, మహబూబ్ భాషాలపై నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దిలీప్ కాసేపటి కిందట కన్నుమూశాడు. వివేకానందరెడ్డి హత్య కేసులో భరత్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పులివెందుల పట్టణంలోని గొర్రెల వ్యాపారి దిలీప్‌కు భరత్‌కుమార్ యాదవ్‌కు మధ్య ఆర్థికపరమైన లావాదేవీలుఉన్నాయి. వారం రోజులుగా వీరిద్దరి మధ్య డబ్బుల విషయంపై గొడవలు జరుగుతుననాయి.

gun fire in pulivendula
కడప జిల్లా పులివెందులలో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. భరత్‌కుమార్ యాదవ్ అనే దిలీప్, మహబూబ్ భాషాలపై నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దిలీప్ కాసేపటి కిందట కన్నుమూశాడు. వివేకానందరెడ్డి హత్య కేసులో భరత్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పులివెందుల పట్టణంలోని గొర్రెల వ్యాపారి దిలీప్‌కు భరత్‌కుమార్ యాదవ్‌కు మధ్య ఆర్థికపరమైన లావాదేవీలుఉన్నాయి. వారం రోజులుగా వీరిద్దరి మధ్య డబ్బుల విషయంపై గొడవలు జరుగుతుననాయి. భరత్‌కు దిలీప్ అప్పు ఉన్నాడు. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఈ రోజు కూడా ఇద్దరు ఘర్షణ పడ్డారు. వెంటనే ఇంట్లోకి వెళ్లిన భరత్‌కుమార్‌యాదవ్ తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ సమయంలో దిలీప్ పక్కనే ఉనన అతడి స్నేహితుడు మహబూబ్ బాషా ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిపై కూడా భరత్ కాల్పులకు తెగబడ్డాడు. తీవ్ర గాయాలతో ఇద్దరు అక్కడే కుప్పకూలారు. ఇది చూసి భరత్‌కుమార్ తుపాకీతో అక్కడ్నుంచి పారిపోయాడు. పోలీసులు బాధితులను పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రిమ్స్ ఆసపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దిలీప్ చనిపోయాడు. భరత్‌కు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న భరత్‌కుమార్ యాదవ్ కోసం గాలిస్తున్నారు.
