Minister Jayaram Jump: కాంగ్రెస్లోకి వైసీపీ మంత్రి జంప్ ?
మంత్రి గుమ్మనూరు జయంరాం తనకు టిక్కెట్ రాదని నిర్దారణకు వచ్చారా? ఆయన కోసం కొంత మంది కర్నాటక మంత్రులు(Karnataka ministers) రంగంలోకి దిగారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఎన్నకల్లో అధికారమే లక్ష్యంగా అధికార వైసీపీ(ycp)..సర్వేల్లో సానుకూలతలేని సిట్టింగ్లను మార్చేస్తోంది. ఈ క్రమంలోనే ఆలూరు(Alur)లో మంత్రి గుమ్మనూరు జయరాం(Minister Gummanur Jayaram)ను తప్పించి..ఎమ్మెల్సీ మధుసూదన్(mlc Madhusudan)కు పగ్గాలిచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం.

అధికార వైసీపీలో సిట్టింగ్ ల పునాదులు కదులుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, సీనియర్లు అనే తేడాలేకుండా గెలిచే అవకాశం లేని సిట్టింగ్ అభ్యర్థులను సీఎం జగన్(cm jagan) మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి జయరాంకు ఆలూరు నుంచి టిక్కెట్ ఇవ్వడం లేదని సమాచారం. దీనిపై ఇప్పటికే సీఎం జగన్ కూడా క్లారిటీ ఇచ్చారట. అయితే తనకు కాదంటే..తన తనయుడు ఈశ్వర్(Eswar) కు టిక్కెట్ కేటాయించాలని అభ్యర్థించారట. ఆలూరులో మంత్రి జయరాంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించారట. అధినేత మాత్రం మూడో జాబితా(Third list)లో పేరు చూసుకోవాలంటూ సూచనప్రాయంగా చెప్పినట్టు సమాచారం. దీంతో తనకు టిక్కెట్ రాదని నిర్దారించుకున్న మంత్రి జయరాం..కర్నాటక మంత్రులను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆలూరు టిక్కెట్(Alur ticket)
అధిష్టానం ఇవ్వకపోతే కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. కర్నాకట ప్రభుత్వంలో గుమ్మనూరు జయరాం సోదరుడు నాగేంద్ర మంత్రి(minister Nagendr)గా ఉన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Deputy CM DK Shivakumar)తో వీరికి మంచి సంబంధాలు ఉన్నాయి. వైఎస్ షర్మిల(YS Sharmila) సారథ్యంలో ఎన్నికల బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఆలూరులో ఈసారి ట్రయాంగిల్ పోటీ తప్పదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.