పెళ్లి వేడుక సరదా సరదాగా ఉంటుంది. బంధుమిత్రులతో కళకళలాడుతుంటుంది. వధూవరులతో మిత్రులు చేసే అల్లరి, స్టేజ్‌పై డాన్సులు కూడా తమాషాగా ఉంటాయి.

పెళ్లి వేడుక సరదా సరదాగా ఉంటుంది. బంధుమిత్రులతో కళకళలాడుతుంటుంది. వధూవరులతో మిత్రులు చేసే అల్లరి, స్టేజ్‌పై డాన్సులు కూడా తమాషాగా ఉంటాయి. వివాహ వేడుకలో జరిగే సరదా సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. లేటెస్ట్‌గా ఓ ఫోటో అలాగే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాసేపట్లో పెళ్లి జరగబోతున్నది. పురోహితులు మంత్రాలతో బిజీగా ఉన్నారు. పెళ్లికొడుకు పెళ్లి పీటలమీద కూర్చున్నాడే కానీ అతడి ధ్యాస మరో వైపు ఉంది. మండపంపైనే ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతూ కనిపించాడు. వెనుక ఉన్న తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ఫోన్‌లో లూడో ఆడుతూ కెమెరా కంటపడ్డాడు. ఆ ఫోటోను ఓ నెటిజన్‌ ఎక్స్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు తలో రకంగా కామెంట్‌ చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story