ఒకప్పుడు పెళ్లి(Marriage) వేడుక పద్దతిగా, సంప్రదాయబద్ధంగా జరిగేది. ఆ అపురూపమైన సందర్భాన్ని జీవితాంతం గుర్తిండిపోయేట్టుగా గొప్పగా జరుపుకునేవారు. ఇప్పుడు అలా కాదు. వివాహ వేడుకల్లో కూడా వెరైటీ చూస్తున్నారు. ఇతరుల కంటే భిన్నంగా జరుపుకోవడానికి తాపత్రయపడుతున్నారు.
ఒకప్పుడు పెళ్లి(Marriage) వేడుక పద్దతిగా, సంప్రదాయబద్ధంగా జరిగేది. ఆ అపురూపమైన సందర్భాన్ని జీవితాంతం గుర్తిండిపోయేట్టుగా గొప్పగా జరుపుకునేవారు. ఇప్పుడు అలా కాదు. వివాహ వేడుకల్లో కూడా వెరైటీ చూస్తున్నారు. ఇతరుల కంటే భిన్నంగా జరుపుకోవడానికి తాపత్రయపడుతున్నారు. బరాత్‌లో వధూవరులు ఇద్దరు డాన్సులు చేయడం, రిసెప్షన్ వేదికపై పెళ్లికూతురు నృత్యం(Bride Dance) చేయడం..భిన్నంగా కార్డులు ప్రింట్(Wedding invitations) చేయడం ఇలాంటవన్నమాట! ఇట్టాగే ఓ యువకుడు హల్దీ వేడుకను(Haldi event) చిత్రాతిచిత్రంగా జరుపుకున్నాడు. యాదాద్రి భువనగిరి(Bhuvanagiri) జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరానికి చెందిన నరేందర్ అనే యువకుడికి వలిగొండకు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. పెళ్లి వేడుకలో మంగళస్నానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ కార్యక్రమాన్ని పవిత్రంగా జరుపుతారు. పసుపునీటితో పెళ్లికొడుకుకు స్నానం చేయిస్తారు. నరేందర్ కుటుంబసభ్యులు పసుపు నీళ్లలో గులాబీ రేకులు కలిపి జల్లెడతో స్నానం చేయిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో పెళ్లికొడుకు మిత్రులు అక్కడకి వచ్చారు. నానా హంగామా చేశారు. వరుడిపై కల్లు, బీరు, విస్కీ(Alcohol) పోశారు. వారు ఈ హల్దీ ఫంక్షన్ ను మద్యం బాటిల్స్‌తో డ్యాన్సులు, విన్యాసాలు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఏమిటో .. అందుకే అన్నారు ఎవరి పిచ్చి వారికి ఆనందమని!