✕
జార్ఖండ్(Jharkhand ) లో ఓ ప్రమాదం చోటుచేసుకుంది.. ఊహించని ఘటనకు అక్కడి వారందరూ షాక్ అయ్యారు. షాకింగ్ నుంచి తేరుకొని చూస్తే లక్కీగా ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.. ఇంతకీ ఏం జరిగిందో వివరాలు తెలుసుకుందాం.

x
plane crashes
-
- జార్ఖండ్(Jharkhand ) లో ఓ ప్రమాదం చోటుచేసుకుంది.. ఊహించని ఘటనకు అక్కడి వారందరూ షాక్ అయ్యారు. షాకింగ్ నుంచి తేరుకొని చూస్తే లక్కీగా ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.. ఇంతకీ ఏం జరిగిందో వివరాలు తెలుసుకుందాం.
-
- జార్ఖండ్(Jharkhand) లోని ధన్బాద్(Dhanbad) లో ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లోకి గ్లైడర్ విమానం దూసుకెళ్లింది(Glider Plane crash). బార్వాడా ఏర్ స్ట్రిప్ నుంచి టేకాప్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ తో పాటు పద్నాలుగేళ్ల బాలుడు గాయపడ్డాడు. దన్ బాద్ లోని బర్వాడ్డ ఏర్ స్ట్రిప్ నుంచి ఒక చిన్న విమానం బయల్దేరింది. అయితే టేకాఫ్ కొద్దిసేపటికే విమానం ఎయిర్ పోర్టుకు ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంటిని ఢీ కొట్టింది. విమానం లో ఉన్న పైలట్ , బాలుడు గాయపడ్డారు. ఈ విసయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఇంట్లో ఉన్న వారికి ప్రమాదం ఏమి జరగలేదని ఆ ఇంటి సభ్యులు తెలిపారు.

Ehatv
Next Story