నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో భారీ పేలుళ్లు(Blast) సంభవించాయి. ఒక్కసారిగా పేలుళ్లతో భారీ శబ్దాలు, మంటలు చెలరేగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు(Police) హుటాహుటిన అగ్నిమాపక వాహనాలతో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. ప్రాణాపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకన్నారు. ఈ పేలుడి ధాటికి భవనం గోడలు ఎగిరిపడ్డాయి. పుణెలోని(Pune) ఓ భవనంలో ఈ పేలుడులు సంభవించాయి.

వివరాల్లోకి వెళ్లే.. మహారాష్ట్ర(Maharastra) పుణెలోని విమన్‌నగర్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అక్రమంగా 100కు పైగా సిలిండర్లు(Cylinders) నిల్వ ఉంచారు. ఆ భవనంలో సిలిండర్లు పేలి మంటలు చెలరేగాయి. దాదాపు 12 సిలిండర్లు ఈ ప్రమాదంలో పేలినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం కానీ, ఎవరూ గాయపడలేదు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారిస్తున్నారు. అక్రమంగా సిలిండర్లు నిల్వ చేసినవారిని అరెస్ట్(Arrest) చేస్తామన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని.. దర్యాప్తులో కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.

Updated On 27 Dec 2023 6:16 AM GMT
Ehatv

Ehatv

Next Story