మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను.. ప్రముఖ యూట్యూబర్ గంగవ్వ నిలబెట్టి తిట్టేసిందట. ఈ విషయాన్ని చరణ్ స్వయంగా వెల్లడించారు. అసలు విషయం ఏంటంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను.. ప్రముఖ యూట్యూబర్ గంగవ్వ నిలబెట్టి తిట్టేసిందట. ఈ విషయాన్ని చరణ్ స్వయంగా వెల్లడించారు. అసలు విషయం ఏంటంటే..?

గ్లోబల్ హీరో రామ్ చరణ్ , యూట్యూబర్ గంగవ్వ.. వీళ్ళిద్దరికి ఎక్కడ పరిచయం, గంగవ్వ(Gangavva ) చరణ్ నిలదీసి తిట్టడం ఏంటి..? అసలు ఈ సందర్భం వస్తుందని ఎవరైనా ఊహించారా..? అసలు చరణ్ ను గంగవ్వ ఎక్కడ తిట్టారు, ఎందుకు తిట్టారు. అసలు కథేంటో తెలుసుకుందాం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా బిగ్ బాస్ తెలగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. నిఖిల్ విన్నర్ గా నిలవడంతో ట్రోఫీ అందించారు చరణ్. అయితే అంతకు ముందు రామ్ చరణ్ ఈ సీజన్ లో ఎలిమినేట్అయిన కంటెస్టెంట్స్ తో కూడా మాట్లాడారు.

అయితే నాగార్జున(Nagarjuna) ఒక్కొక్కరిని పరిచయంచేసుకుంటూ వస్తుండగా.. గంగవ్వ దగ్గర ఆగిపోయారు. గంగవ్వ కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి కొన్ని వారాలుఉన్నారు. ఇక చరణ్ కు నాగార్జున ఆమెను పరిచయం చేయబోతుండగా.. తనకు గరంగవ్వ ముందుగానే తెలుసునని రామ్ చరణ్ షాక్ ఇచ్చారు. దాంతో అందరు ఆశ్చర్యపోయారు. గంగవ్వ గేమ్ ఛేంజర్ లో చరణ్ తో పాటు నటించారట. ఆమె నన్ను తెగ తిట్టేసింది. అధికారిగా ఉన్న నన్ను నిలదీసే పాత్రలో కనిపించింది అని గుర్తు పెట్టుకుని మరీ గంగవ్వను పలుకరించారు రామ్ చరణ్.

అంతే కాదు రోహిణి కూడా గేమ్ ఛేంజర్ లో చిన్న పాత్రలో నటించింది. అటు రోహిణి పేరు కూడా గుర్తు పెట్టుకుని మరీ పలకరించారు చరణ్. దాంతో ఆమె తెగ సంతోషపడింది. మాలాంటి చిన్న ఆర్టిస్ట్ వైపు మీరు చూస్తారు అని అనుకోలేదు సార్. కాని గుర్తు పెట్టుకుని మరీ పలకరించడం అనేది మా అదృష్టం అంటూ రోహిని అన్నారు. ఇలా రామ్ చరణ్ ను తిట్టిపోసే మహిళ పాత్రలో గంగవ్వ గేమ్ ఛేంజర్ లో కనిపించబోతున్నట్టు అర్ధం అయ్యింది.

అంతే కాదు గంగవ్వ పాత్రను కూడా ఈ సందర్భంగా రివిల్ చేశారు రామ్ చరణ్. తన పాత్రకు సబంధించి కూడా క్లారిటీ ఇచ్చినట్టే అయ్యింది. ఇక చరణ్ నటించిన గేమ్ చేంజర్ పాన్ ఇండియా వైడ్ గా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటించింది.

ehatv

ehatv

Next Story