ప్రజా గాయకుడు గద్దర్‌(Gaddar) ఏ కార్యక్రమానికి వెళ్లినా తన వెంట ఓ కర్రను(stick) పట్టుకుని వెళుతుంటారు. గద్దర్‌ ఈ కర్రను ఎందుకు ఎప్పుడూ తన వెంటే ఉంచుకున్నారనే అనుమానం చాలా మందికి కలిగే ఉంటుంది. అయితే ఆ కర్ర గద్దర్‌ది కాదు, ఆయన తండ్రిది. మొదటి దానికి బుద్ధుడి జెండా ఉండేది.

ప్రజా గాయకుడు గద్దర్‌(Gaddar) ఏ కార్యక్రమానికి వెళ్లినా తన వెంట ఓ కర్రను(stick) పట్టుకుని వెళుతుంటారు. గద్దర్‌ ఈ కర్రను ఎందుకు ఎప్పుడూ తన వెంటే ఉంచుకున్నారనే అనుమానం చాలా మందికి కలిగే ఉంటుంది. అయితే ఆ కర్ర గద్దర్‌ది కాదు, ఆయన తండ్రిది. మొదటి దానికి బుద్ధుడి జెండా ఉండేది. ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరిన తర్వాత ఆ కర్రకు ఎర్రజెండా(Red Flag) తోడయ్యింది. అటు పిమ్మట జ్యోతిరావు పూలేకు(Jyoti Rao Pule) గుర్తుగా నీలం రంగును కూడా జత చేశారు గద్దర్‌. ప్రపంచాన్ని పీడన నుంచి విముక్తి చేయడానికి కారల్‌ మార్క్స్‌ జ్ఞాన సిద్ధాంతం తెచ్చారని, అందుకోసమే ఎర్రజెండాను కర్రకు చుట్టానని గద్దర్‌ చెప్పేవారు. మార్క్స్‌ జ్ఞాన సిద్ధాంతం, పూలే, అంబేద్కర్‌ భావాలను కలపాలనేది తన వాదన అని గద్దర్‌ అనేవారు..

Updated On 7 Aug 2023 4:40 AM GMT
Ehatv

Ehatv

Next Story