వరంగల్ జిల్లాలో(Warangal) ఘోర ప్రమాదం(Road Accident) జరిగింది. ఎల్కతుర్తి(ఎల్కతుర్తి) మండలం శాంతినగర్(Shanti Nagar) దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దైవదర్శనానికి వెళ్లూ దైవలోకానికి నలుగురు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

Warangal Road Accident
వరంగల్ జిల్లాలో(Warangal) ఘోర ప్రమాదం(Road Accident) జరిగింది. ఎల్కతుర్తి(Elkathurthi) మండలం శాంతినగర్(Shanti Nagar) దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దైవదర్శనానికి వెళ్లూ దైవలోకానికి నలుగురు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్లే.. ఏటూరునాగారానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలకు చెందినవారు వేములవాడ దర్శనానికి వెళ్తున్నారు. ఎల్కతుర్తి మండలం శాంతినగర్ దగ్గర ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు మంతెన శంకర్ (60), మంతెన కాంతయ్య (72), మంతెన చందన (16), మంతెన భరత్ (29)గా గుర్తించారు. గాయపడ్డ రేణుక, భార్గవ్, శ్రీదేవిలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి(MGM Hospital) తరలించారు. చనిపోయిన మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతులు, క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఏటూరునాగారంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
