Nallari Kiran Kumar Reddy Join BJP : బీజేపీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
అవిభక్త ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh )చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Nallari Kiran Kumar Reddy) శుక్రవారం (ఏప్రిల్ 7) బీజేపీలో చేరారు(Jions BJP). కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో బీజేపీ కీలక నేతల సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. కీలక హామీతో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ముందుకు వచ్చినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరోవైపు.. రాయలసీమ(Rayalaseema)లో పార్టీని బలోపేతం చేయాలనుకున్న బీజేపీ.. ఆయన్ను ఆహ్వానించినట్లు ఆసక్తికర ప్రచారం జరిగింది.

కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది నెలలుగా కాంగ్రెస్‌ను వీడుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. కొద్ది రోజుల క్రితం పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామా లేఖ పంపి వార్తలకు తెరదింపారు. 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని విభజించి తెలంగాణను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి నిరసనగా కిరణ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 'జై సమైక్యాంధ్ర' అంటూ సొంత పార్టీని స్థాపించి 2014 ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టారు. ఎన్నికలలో ఓటమి అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అనంతరం 2018 లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.
ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెస్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది. విభజన తరువాత పార్టీ నాయకులు పెద్దఎత్తున ఇతర పార్టీలలోకి వలస పోయారు. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క లోక్‌సభ, అసెంబ్లీ సీటును కూడా గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్.