తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన గ్యారెంటీ దరఖాస్తు ఫారాలను విడుదల చేసింది. ఈ రోజు మధ్యాహ్నం సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) సహా ఇతర మంత్రులు దరఖాస్తు నమూనాను విడుదల చేశారు. ప్రభుత్వం ఇస్తున్న ఐదు గ్యారంటీల కోసం ఒకే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన గ్యారెంటీ దరఖాస్తు ఫారాలను విడుదల చేసింది. ఈ రోజు మధ్యాహ్నం సెక్రటేరియట్(Secretariat)లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) సహా ఇతర మంత్రులు(Ministers) దరఖాస్తు నమూనాను విడుదల చేశారు. ప్రభుత్వం ఇస్తున్న ఐదు గ్యారంటీల కోసం ఒకే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అంటే..ఒక్కో గ్యారెంటీ కోసం వేర్వేరుగా దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. డిసెంబర్ 28నుంచి జనవరి 6వ తేదీవరకూ జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలోని వార్డులకు ప్రొఫార్మాలు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రెండే పేజీల్లో దరఖాస్తు ఉంటుంది. సామాన్య ప్రజలు సులభంగా అర్థం చేసుకొని..పూర్తి చేసేలా దరఖాస్తును రూపొందించారు. మొదటి పేజీలో దరఖాస్తుదారుల వివరాలు, చిరునామా.. రెండో పేజీలో ప్రభుత్వ అభయ హస్తం గ్యారెంటీ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైన వివరాలతో ప్రొఫార్మా తయారు చేశారు. ఇక.. దరఖాస్తుతోపాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్, రేషన్ కార్డులను లబ్దిదారులు జతచేయాల్సి ఉంటుంది. దరఖాస్తు తీసుకున్నాక రసీదు ఇవ్వనున్నారు అధికారులు.