మణికొండ(Maniikonda) జోలీ కిడ్స్ ప్లే స్కూల్(Jolly Kids Play School) లో అగ్ని ప్రమాదం(Fire accident) సంభవించింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను చూసిన చిన్నారులు భయంతో పరుగులు తీశారు. ఘటనపై సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది.

Breaking News
మణికొండ(Maniikonda) జోలీ కిడ్స్ ప్లే స్కూల్(Jolly Kids Play School) లో అగ్ని ప్రమాదం(Fire accident) సంభవించింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను చూసిన చిన్నారులు భయంతో పరుగులు తీశారు. ఘటనపై సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ లో అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదం సంభవించడంతో పిల్లల తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు.
