ప్రముఖ పారిశ్రామికవేత్త, మానవతావాది, టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా దివికేగడాన్ని ఊహించలేకపోతున్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త, మానవతావాది, టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా దివికేగడాన్ని ఊహించలేకపోతున్నారు. ముంబాయి(Mumbai)లోని బ్రీచ్‌ క్యాండీ హాస్పిటల్‌(Breach Candy Hospital)లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన మరణం దేశానికి పెద్ద లోటు. ఆయన వంటి పారిశ్రామికవేత్తను మళ్లీ చూస్తామన్న ఆశ కూడా లేదు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెడుతున్నారు.

భారతీయులకు ఇది బాధాకరమైన రోజన్నారు మెగాస్టార్‌ చిరంజీవి(MegaStar Chiranjeevi). సేవలో రతన్‌టాటాను మించినవారు లేరన్నారు. మనదేశం ఇప్పటి వరకు చూసిన గొప్ప దార్శనికుల్లో ఆయన ఒకరని ప్రశంసించారు. ' రతన్‌టాటా మెగా ఐకాన్‌. నిజమైన పారిశ్రామిక వేత్త, పరోపకారి. అసాధారణ మానవుడు. టాటా బ్రాండ్‌లను గ్లోబల్‌ పవర్‌ హౌస్‌గా నిర్మించడమే కాకుండా.. మనదేశ నిర్మాణంలోనూ అద్భుతంగా కృషి చేశారు. మనం ఒక మంచి మనసు ఉన్న వ్యక్తిని కోల్పోయాం. భారతీయ పారిశ్రామిక వేత్తలలో ఆయన పెంపొందించిన విలువలు తరాలకు స్ఫూర్తినిస్తాయి.. మార్గాన్ని నిర్దేశిస్తాయి. రతన్‌ టాటా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా' అని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని ఇచ్చారు. దర్శకుడు రాజమౌళి(Rajamouli) ఏమన్నారంటే, ' రతన్‌టాటా ఓ లెజెండ్‌. మన హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. టాటా ఉత్పత్తులను ఉపయోగించని రోజును ఊహించుకోవడం కష్టం. ఎన్నోతరాలకు స్ఫూర్తి. పంచ భూతాలతో పాటు ఆయన కూడా ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఎల్లప్పుడూ ఆయన ఆరాధకుడినే. జైహింద్‌' అంటూ నివాళి అర్పించారు. రతన్‌ టాటాది బంగారంలాంటి హృదయమన్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr NTR). భారతదేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పారు. దూరదృష్టి గల వ్యక్తి అని, ఎంతోమంది జీవితాలను మార్చేశారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని ఎన్టీఆర్‌ తెలిపారు. ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ (Khushboo)రతన్‌టాటా ఇక లేరని ప్రపంచం కన్నీరు పెట్టుకుంటోందని వ్యాఖ్యానించారు. 'ఒక పరోపకారి. లక్షలాది మందికి ఆశాజ్యోతి. ఎంతోమందికి స్ఫూర్తి. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎంతో కృషి చేశారు. అలాంటి గొప్ప మనిషి మరొకరు ఉండరు.మిస్‌ యూ సర్‌. ఓం శాంతి' అని ఖుష్బూ నివాళి అర్పించారు.

ehatv

ehatv

Next Story