ఓ కంపెనీకి చెందిన మహిళా ఉద్యోగి(Female employee) రెడ్డిట్‌లో(redit) తన బాస్‌పై మండిపడింది. 8 నిమిషాల పాటు బాత్‌రూంకు(Bathroom) వెళ్లినందుకు తనపై కోపడ్డారని సిక్ లీవ్(Sick Leave) లేదా పెయిడ్ లివ్(Paid leave) తీసుకోవాలని కోరారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బాస్ చేసిన పనిని చూసి షాక్‌కు గురయ్యాయనని తెలిపింది.

8 Minutes Bathroom Break
ఓ కంపెనీకి చెందిన మహిళా ఉద్యోగి(Female employee) రెడ్డిట్‌లో(reddit) తన బాస్‌పై మండిపడింది. 8 నిమిషాల పాటు బాత్‌రూంకు(Bathroom) వెళ్లినందుకు తనపై కోపడ్డారని సిక్ లీవ్(Sick Leave) లేదా పెయిడ్ లివ్(Paid leave) తీసుకోవాలని కోరారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బాస్ చేసిన పనిని చూసి షాక్‌కు గురయ్యాయనని తెలిపింది. నేను వర్క్ ఫ్రం హోం(Work From Home) చేస్తున్నా. ఎనిమిది నిమిషాలు బ్రేక్ తీసుకొని బాత్‌రూం నుంచి తిరిగి వచ్చేసరికి తన బాస్ నుంచి వాయిస్ మెయిల్ వచ్చిందని చెప్పింది. నన్ను సిక్ లీవ్ తీసుకోవాలని లేదా పెయిడ్ లీవ్ పెట్టాలని కోరినట్లు చెప్పింది.
ఈ సందర్భంగా రెడ్డిట్‌లో తనకు ఆఫీస్‌లో జరిగే అవమానాలను బయటపెట్టింది. సూపర్‌వైజర్లు తమను తిడుతుంటారని.. పని షెడ్యూళ్లను ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా మారుస్తుంటారని ఆమె అసహనం వ్యక్తం చేసింది. సాధారణంగా నేను పని పూర్తయ్యేవరకు బ్రేక్స్ తీసుకోనని.. టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు బ్రేక్‌లు తీసుకోనన్నారు. నేను కాలేజ్‌లో సెకండియర్ చదువుతుండగానే ఈ ఉద్యోగం నాకొచ్చిందని చెప్పుకొచ్చింది. ఉద్యోగులపై విపరతీమైన పని ఒత్తిడి పెడుతున్నారని.. పనికి తగ్గట్లు అంతెందుకు మెక్ డొనాల్డ్స్‌లో పనిచేసే ఉద్యోగులకు వచ్చిన వేతనం కూడా తమకు రాదని ఆవేదన చెందింది. కొద్దికాలంలోనే ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో రెడ్డిట్ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కంపెనీని వెంటనే వదిలి వారిపై లీగల్ యాక్షన్‌కు వెళ్లాలని కొందరు కోరితే.. మరొకరేమో బాత్రూం వెళ్లడంపై ఉద్యోగులకు ఆంక్షలు పెడితే అమెరికాలో చట్ట ఉల్లంఘననేనని మరొకరు అన్నారు.
