మద్యం అమ్మకాల్లో(Alcohol Selling) తెలంగాణ(Telangana) మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏ రేంజ్ ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలైన ఏపీ(AP), తమిళనాడు(Tamilnadu), కేరళకు(Kerala) మించి ఇక్కడ మద్యం వినియోగిస్తున్నట్టు తేలింది. దక్షిణాదిలో లిక్కర్ వినియోగంలో తెలంగాణది టాప్ ప్లేస్ అన్నమాట. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగానే సమకూరుతోందని..

మద్యం అమ్మకాల్లో(Alcohol Selling) తెలంగాణ(Telangana) మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏ రేంజ్ ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలైన ఏపీ(AP), తమిళనాడు(Tamilnadu), కేరళకు(Kerala) మించి ఇక్కడ మద్యం వినియోగిస్తున్నట్టు తేలింది. దక్షిణాదిలో లిక్కర్ వినియోగంలో తెలంగాణది టాప్ ప్లేస్ అన్నమాట. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగానే సమకూరుతోందని..లిక్కర్ లెక్కలను నివేదిక రూపంలో సీఎం రేవంత్‎రెడ్డి(CM Revanth Reddy) ముందు ఉంచారు ఎక్సెజ్‎శాఖ అధికారులు.

ఎక్సైజ్ అధికారుల నివేదిక(Excise Report) ప్రకారం.. లిక్కర్, బీరు వినియోగంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. దక్షిణాదిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ మొత్తంలో మద్యం సేవిస్తున్నారు. రాష్ట్రంలో తలసరి లిక్కర్ వినియోగం గత ఏడాది 9 లీటర్లుగా, బీరు వినియోగం 10.7 లీటర్లుగా నమోదైంది. లిక్కర్ సేల్స్, వినియోగంపై ఇటీవల సీఎం రేవంత్‌‌రెడ్డికి సమర్పించిన రిపోర్టులో ఈ విషయాలను ఎక్సైజ శాఖ అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. ఏపీ, తమిళనాడు, కేరళలను మించి తెలంగాణలో లిక్కర్ వినియోగం ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ఆదాయం కూడా భారీగా సమకూర్చుకుంటున్నట్లు సీఎం రేవంత్‎రెడ్డికి వివరించారు.

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.52 కోట్లు. ఈ ప్రాతిపదికన ఒక ఏడాదిలో మద్యం అమ్మకాలు, వినియోగంపై ఎక్సైజ్ శాఖ లెక్కలు తేల్చింది. ఏపీ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ.. లిక్కర్, బీర్ల వినియోగం తక్కువగా ఉంది. ఏపీలో తలసరి మద్యం వినియోగం 6.04 లీటర్లు. అదే బీర్ల విషయానికొస్తే సగటున ఒక్కొక్కరు కేవలం 1.86 లీటర్లు తాగుతున్నారు. తమిళనాడులో తలసరి లిక్కర్ వినియోగం 7.66 లీటర్లు. అదే బీర్ల విషయానికొస్తే 3.75 లీటర్లు ఉంది. కేరళ జనాభా దాదాపు తెలంగాణతో సమానం. అక్కడ తలసరి లిక్కర్ వినియోగం 5.93 లీటర్లు, బీర్ల వినియోగం 2.63 లీటర్లుగా ఉంది.

లిక్కర్ తాగడంలోనే కాకుండా.. భారీగా రాబడి సమకూర్చుకుంటున్న దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు తర్వాత తెలంగాణే టాప్‎లో ఉంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కార్..మద్యం అమ్మకాలను నియంత్రించాలని భావిస్తోంది. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‎రెడ్డి.. బెల్ట్ షాపులు లేకుండా ఉండాలంటే ఏం చేయాలో నివేదిక ఇవ్వాలని కోరారు. దీంతో గ్రామాల్లో బెల్ట్ షాపులను పూర్తిస్థాయిలో తీసివేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Updated On 19 Dec 2023 1:49 AM GMT
Ehatv

Ehatv

Next Story