ఓ స్వలింగ జంట(Same gender couple) మగ బిడ్డకు జన్మనివ్వడమే(Birth) చిత్రవిచిత్రమనుకుంటే, ఏకంగా ఇద్దరు కలిసి ఒక బిడ్డనే కడుపున మోయడమన్నది పెద్ద మిరాకిలే! ఈ విచిత్ర ఘటన యూరప్‌లో(Europe) చోటు చేసుకుంది. ఫెర్టిలిటి సెంటర్‌ను(Fertility center) సంప్రదించి బిడ్డలను కనే ప్రయత్నం చేశారనే అనుకున్నా . ఇద్దరూ కడుపులో మోయడం ఏమిటి అనే అనుమానం రాకుండా ఉంటుందా?

ఓ స్వలింగ జంట(Same gender couple) మగ బిడ్డకు జన్మనివ్వడమే(Birth) చిత్రవిచిత్రమనుకుంటే, ఏకంగా ఇద్దరు కలిసి ఒక బిడ్డనే కడుపున మోయడమన్నది పెద్ద మిరాకిలే! ఈ విచిత్ర ఘటన యూరప్‌లో(Europe) చోటు చేసుకుంది. ఫెర్టిలిటి సెంటర్‌ను(Fertility center) సంప్రదించి బిడ్డలను కనే ప్రయత్నం చేశారనే అనుకున్నా . ఇద్దరూ కడుపులో మోయడం ఏమిటి అనే అనుమానం రాకుండా ఉంటుందా? అసలు ఇదేలా సాధ్యమంటారా? కలికాలంలో ఏదైనా సాధ్యమే! ఇంతకు ముందు ఓ స్వలింగ జంట ఇలాగే ఓ బిడ్డను ఇద్దరూ కడుపులో మోసి చరిత్ర సృష్టించారు. ఈ లెక్కన ఈ స్వలింగ జంట రెండోది! స్పెయిన్‌లోని(Spain) మజోర్కాలోని పాల్మాలో 30 ఏళ్ల ఎస్టీఫానియా, 27 ఏళ్ల అజమారా అనే స్వలింగ జంట అక్టోబర్‌ 30వ తేదీన ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరూ మహిళలే కాబట్టి అమ్మతనాన్ని ఆస్వాదించాలనుకున్నారు. పిల్లలను కనాలని కలలు కన్నారు. కలను నిజం చేసుకోవడం కోసం ఫెర్టిలిటి సెంటర్‌కు వెళ్లారు. ముందుగా ఎస్టీఫానియా గర్భంలో స్పెర్మ్‌ను ప్రవేశపెట్టి ఫలదీకరణం చెందేలా చేశారు వైద్య నిపుణులు. అయిదు రోజుల తర్వాత ఆ పిండాన్ని అజహారా గర్భంలో ప్రవేశపెట్టారు. ఈ విధంగా ఒకే బిడ్డను ఇద్దరూ మోశారు. తమ బంగారుకలను నిజం చేసుకోవడానికి నాలుగు లక్షలకుపైగా ఖర్చు పెట్టారు. అయిదేళ్ల కిందట టెక్సాస్‌లో ఓ స్వలింగ జంట ఒకే బిడ్డను మోసి బిడ్డను కన్నారు. ఈ జంట కూడా మహిళలే కావడం విశేషం. ఈ రకమైన వైద్య విధానాన్ని ఇన్వోసెల్‌ అంటారు. పిల్లలు లేని వారికి, పిల్లలను కనడం సాధ్యం కానీ స్వలింగ జంటలకు ఈ వైద్యవిధానం గొప్ప వరం.

Updated On 20 Nov 2023 7:31 AM GMT
Ehatv

Ehatv

Next Story