అగ్రరాజ్యం అమెరికాలో హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. విలాసవంతమైన జీవితాల వెనుక చీకటికుంభకోణాన్ని బయటపెట్టిన ప్రముఖ ఫైనాన్షియర్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ దుర్మార్గాల చిట్టాను న్యూయార్క్‌ కోర్టు తాజాగా బయటపెట్టింది. ఈ కేసుకు సంబంధించిన వెయ్యి పేజీల డాక్యుమెంట్ బుధవారం బహిర్గతం చేసింది. తన పరపతి పెంచుకోవడం కోసం ఏళ్ల తరబడి టీనేజ్‌ అమ్మాయిలను ఎరగా వేసిన జెఫ్రీ ఎపిస్టన్ ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డాడనే విషయాలను ఈ కీలక పత్రాలు వెలుగులోకి తెచ్చాయి.

అగ్రరాజ్యం అమెరికాలో హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం(high-profile sex scandal) మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. విలాసవంతమైన జీవితాల వెనుక చీకటికుంభకోణాన్ని బయటపెట్టిన ప్రముఖ ఫైనాన్షియర్‌(Famous financier ) జెఫ్రీ ఎప్‌స్టీన్‌(Jeffrey Epstein) దుర్మార్గాల చిట్టాను న్యూయార్క్‌ కోర్టు (NewYork court) తాజాగా బయటపెట్టింది. ఈ కేసుకు సంబంధించిన వెయ్యి పేజీల డాక్యుమెంట్ బుధవారం బహిర్గతం చేసింది. తన పరపతి పెంచుకోవడం కోసం ఏళ్ల తరబడి టీనేజ్‌ అమ్మాయిలను ఎరగా వేసిన జెఫ్రీ ఎపిస్టన్ ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డాడనే విషయాలను ఈ కీలక పత్రాలు వెలుగులోకి తెచ్చాయి. వీటిలో చాలా వరకు ఎప్‌స్టీన్‌ కేసుకు సంబంధించిన న్యూస్‌పేపర్‌ కథనాలు, టీవీ డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు, బాధితుల వాంగ్మూలాలు ఉన్నాయి. ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో చివరికి అతడి బండారం బయటపడింది. ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు చేసిన జొహన్నా సోబెర్గ్‌(Johanna Soberg) ఇచ్చిన వాంగ్మూలంలో.. మైఖెల్‌ జాక్సన్‌(Michael Jackson), ప్రిన్స్‌ ఆండ్రూ(Prince Andrew), బిల్‌ క్లింటన్‌(Bill Clinton), ట్రంప్‌(Donald Trump) పేర్లు కూడా ఉన్నాయి. బిల్‌ క్లింటన్‌ను తానెప్పుడూ ప్రత్యక్షంగా కలవలేదని, ఆయనకు బాలికలు, యువతులంటే ఇష్టమని ఎప్‌స్టీన్‌ ఓసారి తనతో చెప్పినట్టు.. సోబెర్గ్‌ వాంగ్మూలంలో పేర్కొన్నట్టు ఆ పత్రాల్లో ఉంది. పేద, మధ్య తరగతి బాలికలు, యువతులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపించి పామ్‌ బీచ్‌ బంగ్లా(Palm Beach Bungalow)లో అఘాయిత్యాలకు పాల్పడిన.. ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం(Epstein sex scandal)అగ్రరాజ్యాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి.. మరో యువతిని ఆ బంగ్లాకు తెస్తే ఇంకొంత మొత్తం కమిషన్‌ ఇస్తానని ఆశచూపేవాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు గొలుసుకట్టు పద్ధతిలో సాగిన ఈ చీకటి వ్యవహారం 2005లో బట్టబయలైంది. అప్పుడు ఎప్‌స్టీన్‌ ను అరెస్టు చేసి కొన్ని నెలలు పాటు జైల్లో ఉంచారు. 2019లో మీటూ ఉద్యమం సమయంలో మరోసారి ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు రాగా.. అతడిని అరెస్టు చేశారు. అదే ఏడాది ఆగస్టులో అతడు జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే నిందితుడు ఎప్‌స్టీన్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Updated On 4 Jan 2024 11:39 PM GMT
Ehatv

Ehatv

Next Story