Butta Renuka contest from Emminganur: ఎమ్మిగనూరు బరిలో బుట్టా రేణుక..అధిష్టానం ప్రకటన లాంఛనమే !
ఎమ్మిగనూరు అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. మాజీ ఎంపీ(Ex MP) బుట్టారేణుక(Butta Renuka)ను ఎమ్మిగనూరు(Emminguru) నుంచి పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. ఈ దఫా బీసీ నేతలకు టికెట్ కేటాయించాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ సీటు కోసం కుస్తీపట్టిన నేతలకు చెక్ పెట్టిన వైసీపీ అధిష్టానం(YCP leadership).. ఊహించని విధంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరును తెరపైకి తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. వయోభారం రీత్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని సిట్టింగ్ ఎమ్మెల్యే(Sitting MLA) ఎర్రకోట చెన్నకేశవరెడ్డి(Errakota Chennakesavareddy) ప్రకటించడంతో..బుట్టా రేణుకకు లైన్ క్లియర్ అయినట్టేనంటున్నాయి పార్టీ వర్గాలు.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ అభ్యర్థుల మార్పుపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సర్వేలను సిట్టింగ్ ఎమ్మెల్యేల ముందు పెట్టి..వారంతట వారే తప్పుకునే విధంగా పార్టీ పెద్దలైన సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy), ధనుంజయ్ రెడ్డి(Dhanunjay Reddy), విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను సీఎం క్యాంపు కార్యాలయానికి రమ్మని సమాచరం ఇచ్చి..మరీ మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే 11 మందిని మార్చగా.. రెండో దఫా లిస్టులో దాదాపు 60 మందిని మారుస్తున్నట్టు సమాచారం. రేపోమాపో ఆ జాబితా విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఎమ్మిగనూరు సెగ్మెంట్ కు మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు ఖారు చేసినట్లు తెలుస్తోంది. కర్నూలు ఎంపీ(Kurnool MP) డాక్టర్ పంజీవ్ కుమార్(Dr. Panjeev Kumar) పేరు కూడా తెరపైకి వచ్చినా నియోజకవర్గ ప్రజలు ఆయనను వ్యతిరేకిస్తున్నట్లు సర్వేల్లో తేలిందట. మరోవైపు బుట్టాకు ఎమ్మిగనూరులో బంధువర్గం ఉండటంతోపాటు తన కుమార్తెను కూడా అదే ప్రాంత వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు ఆమె చేసిన సేవా కార్యక్రమాలు కూడా ప్రజల్లో ఆమెకు ఆదరణ పెంచాయి. అయితే తనకు బుదులుగా రానున్న ఎన్నికల్లో తన కుమారుడు ఎర్రకోట జగన్ మోహన్‌రెడ్డి(Errakota Jagan Mohan Reddy)కి టికెట్ కేటాయించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే కేశవరెడ్డి అభ్యర్ధించినా.. సీఎం జగన్ ఒప్పుకోలేదట. ఇక్కడి నుంచి మరో బీసీ నేత.. వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్( Veerashaiva Lingayat Corporation Chairman) రుద్రగౌడ్ (Rudra goud) టికెట్ ఆశించినా.. సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఆయనకు రాజకీయ వైరం ఉంది. దీంతో సౌమ్యురాలైన బుట్టారేణుకకు టికెట్ కేటాయిస్తేనే.. ఇటు ఎమ్మెల్యే, అటు రుద్రగౌడ్ సహకరిస్తారని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఎమ్మెల్యే కేశవరెడ్డి సపోర్టు చేయకుంటే..మంత్రాలయం ఎమ్మెల్యే(Mantralayam MLA) వై.బాలనాగిరెడ్డి(Y. Balanagi reddy) బుట్టా రేణుకకు తోడుగా ప్రచారం చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే..మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు ఖరారు చేసినట్లు తెలుస్తుండగా.. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.