హైదరాబాద్‌లోని(Hyderabad) మాదాపూర్‌లో(Madhapur) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్న దాని సీఈవో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎక్లాట్ ప్రైమ్(Eclat Prime) అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించి దానికి ఆయనే సీఈవోగా పనిచేస్తున్నాడు. అమెరికాలో కూడా తన కంపెనీని విస్తరించాలనుకున్నాడు. కానీ ఏ కారణం చేతనో అక్కడ వర్కవుట్ కాలేదు. దీంతో మనస్తాపానికి గురైన అతడు ఇంట్లోని కిటికీకి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్‌పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Eclatprime Software

కాశీ విశ్వనాథ్(Kasi Vishwanath) (38) అనే వ్యక్తి మాదాపూర్‌లో ఎక్లాట్ ప్రైమ్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ నెలకొల్పాడు. ఆ కంపెనీకి ఆయనే సీఈవోగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో విదేశాల్లోనూ తన కంపెనీని విస్తరించాలని ప్లాన్ వేశాడు. దీంతో ఆరు నెలల క్రితం అతను అమెరికా వెళ్లాడు. అమెరికాలో బ్రాంచ్‌ను నెలకొల్పాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్లి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కారణాలు తెలియలేనప్పటికీ అమెరికాలో బ్రాంచ్ ఏర్పాటు చేసేందుకు కుదరకపోవడంతో తిరిగి స్వదేశానికి వచ్చాడు. కానీ తన లక్ష్యం నెరవేరకపోవడంతో మనస్తాపంగా ఉంటున్నాడు. అమీన్‌పూర్‌లోని దు్గా హోమ్స్ ఫేజ్-2లో నివాసం ఉంటున్నాడు. అయితే మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో తన ఇంట్లోని కిటీకికి చున్నీతో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య వినీల ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే విశ్వనాథ్ మృతికి అదొక్కటే కారణమా లేదా ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.