బంగారం కొనాలనుకునే మహిళలకు మంచి శుభవార్త. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం ధర..తగ్గుముఖం పట్టింది. సంక్రాంతి పండుగ సందర్భంగా వరుసగా మూడో రోజు బంగారం ధర తగ్గడంతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బంగారం కొనాలనుకునే మహిళలకు మంచి శుభవార్త. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం ధర..తగ్గుముఖం పట్టింది. సంక్రాంతి పండుగ(sankranthi festival) సందర్భంగా వరుసగా మూడో రోజు బంగారం ధర తగ్గడంతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పండగలు, ఇతర శుభకార్యాలు, వేడుకల సమయాల్లో గోల్డ్ రేట్లు(gold rates) పెరిగిపోతాయి. గతేడాది చివరలో పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఇప్పుడు మాత్రం బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్(International Gold Market)కు అనుగుణంగా దేశీయంగా గోల్డ్ రేట్లు(Domestic gold rates)తగ్గుతున్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తాజాగా రూ. 100 తగ్గింది. దీంతో ప్రస్తుతం తులానికి రూ. 58 వేలు పలుకుతోంది. ఇది అంతకుముందు రెండు రోజులు కూడా వరుసగా రూ. 250, రూ. 400 చొప్పున తగ్గింది. దీంతో 3 రోజుల్లోనే రూ. 750 దిగొచ్చింది. ఇక 24 క్యారెట్స్ స్వచ్ఛమైన గోల్డ్ రేటు కూడా రూ. 110 తగ్గగా ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 63,270 పలుకుతోంది. అంతకుముందు రెండు రోజుల్లో ఇది రూ. 270, రూ. 440 చొప్పున దిగొచ్చింది. దిల్లీలో కూడా పసిడి రేట్లు తగ్గాయి. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 58,150 మార్కుకు చేరింది. మరోవైపు 24 క్యారెట్స్ పసిడి ధర రూ. 130 పడిపోయి రూ. 63,400కు చేరింది.