Today gold rate: దిగొచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్ మార్కెట్‌లో ఎంతుందంటే..!
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఆరు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది ఆఖరులో భారీగా పెరిగిన బంగారం ధరలు జనవరి మొదటివారంలోనూ కొనసాగాయి. తాజాగా బంగారం ధరల్లో డౌన్ ట్రెండ్ కనిపిస్తోంది. గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ ఉండటమే దీనికి నిదర్శనం. ఈ సంక్రాంతికి గోల్డ్ కొనాలనుకునే వారికి ఖచ్చితంగా ఇది గోల్డెన్ ఛాన్సనే చెప్పాలి. 2024 జనవరి 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు పసిడి ధరలు తులం మీద ఏకంగా రూ. 1000 కంటే ఎక్కువ తగ్గింది.
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఆరు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది ఆఖరులో భారీగా పెరిగిన బంగారం ధరలు జనవరి మొదటివారంలోనూ కొనసాగాయి. తాజాగా బంగారం ధరల్లో డౌన్ ట్రెండ్(Down trend in gold prices) కనిపిస్తోంది. గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ ఉండటమే దీనికి నిదర్శనం. ఈ సంక్రాంతికి గోల్డ్ కొనాలనుకునే వారికి ఖచ్చితంగా ఇది గోల్డెన్ ఛాన్సనే చెప్పాలి. 2024 జనవరి 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు పసిడి ధరలు తులం మీద ఏకంగా రూ. 1000 కంటే ఎక్కువ తగ్గింది. యూఎస్ డిసెంబర్ నెల ద్రవ్యోల్బణం డేటాపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టడంతో, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి కిందకు దిగుతోంది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,039 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలోనూ బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ 57,700, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,950, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 47,210 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.
హైదరాబాద్ మార్కెట్(Hyderabad gold rate)లో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ బంగారం ధరలు రూ.57,800, 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ.63050లుగా ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ.200, రూ.220 తగ్గినట్లు తెలుస్తోంది. ఇక విజయవాడ(vijayawada gold rate)లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 57,700, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,950, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 47,210 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 78,000లుగా ఉంది. విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. చెన్నై(chennai gold rate)లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 58,200 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,490 కి చేరింది. కోయంబత్తూర్(Coimbatore gold rate)లోనూ ఇదే రేటు అమల్లో ఉంది. ముంబయి(Mumbai gold rate)లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,700, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,950లకు చేరింది.
ఢిల్లీ(delh gold rate)లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 57,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,100 గా నమోదైంది. జైపుర్, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.కోల్‌కతా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 57,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,950 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 57,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,950 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది. కేరళలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 58,000 , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,050లుగా ఉంది.