Donald Trump Hush Money Case : కోర్టులో లొంగిపోతున్న ట్రంప్.. న్యూయార్క్‌లో భద్రత కట్టుదిట్టం..
పోర్న్ స్టార్‌కు డబ్బులిచ్చి అనైతిక ఒప్పందం చేసుకున్నాడనే కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇవాళ మధ్యాహ్నం (అమెరికా కాలమాన ప్రకారం) మన్‌హట్టన్ అటార్నీ కార్యాలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్(New York)లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రహదారులను మూసివేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు.
పోర్న్ స్టార్‌కు డబ్బులిచ్చి అనైతిక ఒప్పందం చేసుకున్నాడనే కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇవాళ మధ్యాహ్నం (అమెరికా కాలమాన ప్రకారం) మన్‌హట్టన్ అటార్నీ కార్యాలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్(New York)లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రహదారులను మూసివేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు, న్యూయార్క్ పోలీసులు సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా చరిత్రలోనే ఇలా మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ కేసు నమోదు కావడం ఇదే ప్రథమం. పైగా ట్రంప్ వచ్చే ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా పోటీ చేయడానికి ఉత్సాహపడుతున్నారు. అరెస్ట్ ఖాయమవ్వడంతో ఎందుకైనా మంచిదని తనే స్వయంగా కోర్టు ముందు లొంగిపోయి విచారణకు హాజరవ్వాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు.
2016లో అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు ట్రంప్. అంతకు మునుపే శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్ వివాహేతర సంబంధం పెటుకున్నాడు. అధ్యక్ష పదవి రేసులో ఉన్న సమయంలో ఇది బయటకు పొక్కితే పరువు పోతుందన్న ఉద్దేశంతో ట్రంప్ ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులిచ్చి మేనేజ్ చేశారు. దాదాపు లక్షా 30 వేల డాలర్లు ఇచ్చారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అబ్బే ఇదంతా కట్టుకథ, అసత్యాల పుట్ట అని, ఉత్తపుణ్యానికే తనను వేధిస్తున్నారని ట్రంప్ అంటున్నప్పటికీ ఆ పోర్న్ స్టార్‌కు డబ్బులివ్వడం నిజమేనని విచారణలో తేలింది. ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్, లాయర్ మైఖేల్ కోహెన్ ఈ విషయంలో ప్రత్యక్ష సాక్షి అట! ఆయనే స్టార్మీ డేనియల్స్‌కు డబ్బును ఇచ్చారట. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత అంటే 2018లో స్టార్మీ డేనియల్స్ మీడియా ముందుకొచ్చారు. ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని బాంబు పేల్చారు. మా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్ ఏంజిలిస్ కోర్టులో దావా కూడా వేశారు. ఇది జరిగినప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. అందుకే దర్యాప్తు సంస్థలు ఈ కేసును హైప్రొఫైల్ కేసు కింద ట్రీట్ చేశాయి. విచారణ చేపట్టాయి. విచారణలో ఆరోపణలు రుజువయ్యాయి. ట్రంప్ మీద క్రిమినల్ కేసు నమోదయ్యింది.