యూఎస్‌లో ఉంటున్న హెచ్1బీ(H1B) వీసాదారులకు అమెరికా(America) శుభవార్త చెప్పింది. ఇకపై హెచ్1బీ వీసా పునరుద్ధరణ కోసం యూఎస్‌ను విడిచి మరో దేశం వెళ్లాల్సిన అవసరం లేదు. మూడేళ్ల సమయంతో అమెరికాలో హెచ్1బీ వీసా ఇస్తారు. గతంలో దీని పునరుద్ధరణ కోసం ఆ దేశాన్ని విడిచిపెట్టాలన్న నిబంధన ఉండేది. దీంతో హెచ్1బీ వీసా ఉన్నవారు..
యూఎస్‌లో ఉంటున్న హెచ్1బీ(H1B) వీసాదారులకు అమెరికా(America) శుభవార్త చెప్పింది. ఇకపై హెచ్1బీ వీసా పునరుద్ధరణ కోసం యూఎస్‌ను విడిచి మరో దేశం వెళ్లాల్సిన అవసరం లేదు. మూడేళ్ల సమయంతో అమెరికాలో హెచ్1బీ వీసా ఇస్తారు. గతంలో దీని పునరుద్ధరణ కోసం ఆ దేశాన్ని విడిచిపెట్టాలన్న నిబంధన ఉండేది. దీంతో హెచ్1బీ వీసా ఉన్నవారు.. దాని పునరుద్ధరణ కోసం స్వదేశం లేదా మరో దేశం వెళ్లి హెచ్1బీకి దరఖాస్తు చేసుకునేవారు. ఈ నిబంధనలను ఎత్తివేయాలని అమెరికా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ను(Joe biden) ప్రధాని మోడీ(Modi) కోరడంతో ఆ దిశగా చర్యలు చేపట్టింది. అమెరికాలోనే ఉంటూ H1B పునరుద్ధరణకు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించింది. పైలెట్ ప్రాజెక్టుగా 20 వేల హెచ్1బీ వీసాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ఈ పైలెట్ ప్రాజెక్ట్(Pilot project) విజయవంతమైతే.. అక్కడే ఉంటూ H1B వీసాలు పునరుద్ధరించుకోవచ్చు.