కుక్కలకు(Dogs) బోల్డంత విశ్వాసం ఉంటుంది. కొంచెం ప్రేమ చూపిస్తే చాలు ప్రాణం ఉన్నంత వరకు విశ్వాసంగా ఉంటాయి. యజమానుల కోసం అవసరమైన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. అందుకే వాటిని చాలా ప్రేమగా చూసుకుంటారు. కుటుంబసభ్యులలో ఒకరిగా భావించి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వాటికి ఏమైనా అయితే తట్టుకోలేరు.

కుక్కలకు(Dogs) బోల్డంత విశ్వాసం ఉంటుంది. కొంచెం ప్రేమ చూపిస్తే చాలు ప్రాణం ఉన్నంత వరకు విశ్వాసంగా ఉంటాయి. యజమానుల కోసం అవసరమైన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. అందుకే వాటిని చాలా ప్రేమగా చూసుకుంటారు. కుటుంబసభ్యులలో ఒకరిగా భావించి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వాటికి ఏమైనా అయితే తట్టుకోలేరు. అంత ఆప్యాయంగా చూసుకునే కుక్కులకు కొందరు బర్త్‌డే వేడుకలు చేస్తారు. సీమంతం జరిపిస్తారు. వాటికి డ్రస్సులు కూడా కుట్టిస్తారు. కానీ కర్ణాటకకు(Karnataka) చెందిన చన్నపట్న(Channapatna) అనే ప్రాంతంలో అయితే కుక్కలకు ఏకంగా ఓ గుడే(temples) ఉంది. సాధారణ దేవాలయాల్లోలాగే ఈ గుడిలో కూడా ప్రతిరోజూ పూజలు జరుగుతాయి. గ్రామదేవతకు ముందు ఈ శునకాలకే తొలి పూజలు చేస్తారు. ఇంతకు ముందు చెప్పుకున్న చన్నపట్న అనే నగరానికి దగ్గరలో ఉన్న అగ్రహార వలగెరెహల్లి అనే చిన్న గ్రామంలో ఈ శునక దేవాలయం ఉంది. ఆ ఊరి ప్రధాన దేవత కెంపమ్మకు ఆలయాన్ని నిర్మించాలని ఊరి వాళ్లు భావించారు. తలా కొంత సొమ్ము వేసుకుని గుడి కట్టారు. అయితే ఆ ఆలయాన్ని నిర్మించిన కొన్ని నెలలకే ఆ గ్రామానికి చెందిన రెండు కుక్కలు అకస్మాత్తుగా కనిపించకుండా పోయాయి. వాట కోసం ఊరూరా వెతికారు.. కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఓ వ్యాపారవేత్త కలలోకి గ్రామదేవత వచ్చింది. గ్రామస్తుల రక్షణ కోసం తన ఆలయానికి దగ్గరలో కనిపించకుండాపోయిన ఆ కుక్కల కోసం ఓ గుడి నిర్మించాలని కోరిందట! వెంటనే గుడి కట్టించి అందులో ఆ రెండు శునకాల విగ్రహాలను ప్రతిష్టించారు ప్రజలు. ప్రతి రోజూ పూజలు చేస్తున్నారు. అంతేనా.. శునకాల పేరుతో ప్రతి ఏడాది ఓ పండుగ కూడా నిర్వహిస్తున్నారు. కుక్కలకు గుడి ఉందన్న విషయం ఆనోటా ఈ నోటా అందరికీ తెలిసింది. అంతే గుడికి జనం రావడం మొదలు పెట్టారు. ఇప్పుడు టూరిస్టులు కూడా వస్తున్నారు.

Updated On 27 July 2023 5:52 AM GMT
Ehatv

Ehatv

Next Story