డైరెక్టర్ త్రినాథరావు.. నోటి దూలగాడేగా.. 'పేరు' వివాదం.. హీరోయిన్‌పై అసభ్య వ్యాఖ్యలు
తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నిన్న హీరోయిన్ అన్షుపై అనుచిత వ్యాఖ్యల పట్ల తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద సీరియస్ అయ్యారు. త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా మహిళా కమిషన్ స్వీకరించినట్లు చైర్మన్ నేరేళ్ల శారద వెల్లడించారు. త్రినాథ రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద అన్నారు. నిన్న జరిగిన మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ త్రినాథ్ నక్కిన మాట్లాడుతూ హీరోయిన్ అన్షు గురించి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ మన్మధుడు తర్వాత అన్షు ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందంటూనే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అన్షు ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత సన్నగా ఉందని.. తానే కొంచెం పెంచాలని.. తెలుగుకు ఇది సరిపోదని.. కొంచెం అన్నీ ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పానంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయిదని అన్నారు. ఈ వ్యాఖ్యలు మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకోవడంతో త్రినాథరావుకు చిక్కులు తప్పేలా లేవు. అంతేకాకుండా ఆ మధ్య అల్లు అర్జున్ సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయినప్పుడు.. వాటర్ అని అడిగి తీసుకోవడాన్ని త్రినాథరావు ఇమిటేట్ చేశాడు. రీతూవర్మ పేరు మర్చిపోయినట్లు యాక్టింగ్ చేస్తూ 'మరో సెకండియర్ హీరోయిన్ పేరూ.. పేరూ.. అంటూ వాటర్ ఇవ్వాలని అడిగి అల్లు అర్జున్‌ను ఇమిటేట్ చేశాడు. రీతూ..రీతూవర్మ కరెక్టే కదమ్మా అంటూ వ్యంగ్యంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది.