రతన్‌ టాటా అమెరికాలో ఉన్నప్పుడు ఓ యువతిని ప్రేమించాడు. కానీ అది పెళ్లి పీటల వరకు రాలేదు.

రతన్‌ టాటా అమెరికాలో ఉన్నప్పుడు ఓ యువతిని ప్రేమించాడు. కానీ అది పెళ్లి పీటల వరకు రాలేదు. లాస్ ఏంజెల్స్‌(Los Angeles)లో పని చేస్తున్నప్పుడు రతన్‌ప్రేమలో పడ్డారు, అయితే 1962 నాటి ఇండో-చైనా(1962 Indo-China War) యుద్ధం కారణంగా, అమ్మాయి తల్లిదండ్రులు తనను భారతదేశాని(India)కి పంపడాన్ని వ్యతిరేకించారని.. దీంతో పెళ్లి ఆగిపోయిందని రతన్‌ టాటా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ తర్వాత అతను పెళ్లి చేసుకోలేదు. తర్వాత రతన్ టాటా వ్యాపార ప్రపంచంలో మునిగిపోయాడు. అతని వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే అవకాశం లేదు.

1991లో రతన్ టాటా తొలిసారిగా టాటా సన్స్ ఛైర్మన్‌(TATA Sons Chairman)గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు టాటా కంపెనీకి జేఆర్‌డీ చైర్మన్‌(JRD Chairman)గా ఉన్నారు. JRD కేవలం ముగ్గురికి మాత్రమే కంపెనీ బాధ్యతలు అప్పగించారు. ఆ ముగ్గురే అన్ని నిర్ణయాలూ తీసుకునేవారు. రతన్ టాటా ఛైర్మన్ అయ్యాక ఆ ముగ్గురిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.రతన్ టాటా పదవీ విరమణ పాలసీని తీసుకొచ్చారు. దీని ప్రకారం 75 ఏళ్ల తర్వాత ఏ డైరెక్టర్‌నైనా కంపెనీ బోర్డు నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత మొదటి ముగ్గురూ తప్పుకోవాల్సి వచ్చింది. టాటా గ్రూప్ భారతదేశంలోని గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి కార్నెల్ విశ్వవిద్యాలయం(Cornell University)లో 230 కోట్ల ఫండ్‌తో టాటా స్కాలర్‌షిప్ ఫండ్‌ను ప్రారంభించారు.

ehatv

ehatv

Next Story