ఇది నిజమో కాదో కానీ ఓ వార్త అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇది నిజమో కాదో కానీ ఓ వార్త అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా పనిచేసిన దీపాదాస్‌మున్షీపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పదవులు, పనుల కోసం దీపాదాస్ మున్షీకి కోట్లు కాంగ్రెస్ నాయకులు కోట్లు ముట్టబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. పైసలు పోయే.. పదవి రాకపాయే అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు లబోదిబోమంటున్నారట. పదవులు, పనుల కోసం దీపాదాస్ మున్షీకి కోట్లు కట్టబెట్టి.. ఇప్పుడు ఆమె వెళ్లిపోవడంతో లబోదిబోమంటున్న కొందరు కాంగ్రెస్ నేతలు. మీకు ఏది కావాలో చెప్పండి చేసి పెడతా అంటూ అందరిని దీపాదాస్ మున్షీ నమ్మించిందంటున్నారు. మీకు కావాల్సింది మీకిస్తా.. నాకు కావాల్సింది నాకివ్వండి అనడంతో సంతోషంలో మునిగి తేలిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆమెను బాధ్యతల నుంచి తప్పించడంతో షాక్‌లో నేతలు ఉన్నారట. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఇదే నిజమైతే కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏమిటో మరి..!
