యాదాద్రి(Yadadri) శ్రీ లక్ష్మీ నరసింహ‎స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుతోపాటు కార్తిక మాసం(Karthika Masam) కావడంతో లక్ష్మీ నారసింహుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

యాదాద్రి(Yadadri) శ్రీ లక్ష్మీ నరసింహ‎స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుతోపాటు కార్తిక మాసం(Karthika Masam) కావడంతో లక్ష్మీ నారసింహుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ప్రత్యేక దర్శనానికి 3 గంటలు.. ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. బ్రేక్ దర్శనానికి సైతం భక్తులు అధిక సంఖ్యలో వెళ్లారు.

యాదాద్రికి భక్తుల(Devotees) రద్దీ కొనసాగుతుండటంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యా కల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు సందడిగా మారాయి. స్వామివారికి.. అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. స్వామివారి స్వాతి నక్షత్రం పురస్కరించుకొని ఆలయ అర్చకులు శతఘటాభిషేకం నిర్వహించారు.

అదేవిధంగా కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భ‌క్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.

Updated On 10 Dec 2023 1:12 AM GMT
Ehatv

Ehatv

Next Story