ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‎ను ఈడీ అధికారులు ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని సమాచారం. ఇప్పటికే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో విచారణకు రావాలని మూడోసారి ఈడీ పంపిన నోటీసులను కేజ్రీవాల్ పెద్దగా ఖాతరు చేయలేదు. దీంతో కేజ్రీవాల్‎ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం ఉందని ఆప్ వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam)లో ఢిల్లీ సీఎం(Delhi CM)అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ను ఈడీ అధికారులు ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని సమాచారం. ఇప్పటికే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Deputy CM Manish Sisodia)ను అరెస్ట్ చేసి సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో విచారణకు రావాలని మూడోసారి ఈడీ పంపిన నోటీసులను కేజ్రీవాల్ పెద్దగా ఖాతరు చేయలేదు. దీంతో కేజ్రీవాల్‎ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం ఉందని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లే మార్గాన్ని మూసివేయడంతో ఆప్ నేతలు అలర్ట్ అయ్యారు. నవంబర్ 2, డిసెంబర్ 21న సీఎం కేజ్రీవాల్‌కు రెండుసార్లు నోటీసులు పంపింది. కానీ..విచారణకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. అయితే కేజ్రీవాల్‌ అరెస్ట్ ఉండదని.. నాలుగోసారి సమన్లు జారీ చేయొచ్చని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేజ్రీవాల్‌ను ఈడీ వర్గాలు అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మంత్రి ఆతిషి(Delhi Minister Atishi)ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ఆ పార్టీ సీనియర్ నేతలు సౌరభ్ భరద్వాజ్(Saurabh Bhardwaj), జాస్మిన్ షా( Jasmine Shah), సందీప్ పాఠక్(Sandeep Pathak) తదితరులు ఇలాంటి పోస్టులే చేశారు. ఈ ఏడాదిలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆప్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఉద్దేశపూర్వకంగానే తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా లిక్కర్ పాలసీ కేసులో తనకు ఈడీ సమన్లు జారీ(ED issued summons) చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ కేసులో తనను సాక్షిగా పిలుస్తున్నారా? లేదా.. అనుమానితుడిగానా అనే విషయంలో స్పష్టత లేదని ఈడీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ ప్రస్తావించారు.

Updated On 3 Jan 2024 11:46 PM GMT
Ehatv

Ehatv

Next Story