డేటా లీక్ కేసు(Data Leak Case)లో కీలక మలుపు.. దేశ వ్యాప్తంగా 66.9 కోట్ల మంది డేటా అమ్ముతున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్‌ను సైబరాబాద్ పోలీసులు(Cyberabad police) అదుపులోకి తీసుకున్నారు. 104 విభాగాలకు చెందిన మనుషుల, సంస్థల డేటా ఈ గ్యాంగ్ దగ్గర ఉంది. 24 రాష్ట్రాలకు, ఎనిమిది మెట్రోపాలిటిన్ నగరాలలో చెందిన డేటాను దొంగతనం చేసి అమ్ముతున్నారు.
డేటా లీక్ కేసు(Data Leak Case)లో కీలక మలుపు.. దేశ వ్యాప్తంగా 66.9 కోట్ల మంది డేటా అమ్ముతున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్‌ను సైబరాబాద్ పోలీసులు(Cyberabad police) అదుపులోకి తీసుకున్నారు. 104 విభాగాలకు చెందిన మనుషుల, సంస్థల డేటా ఈ గ్యాంగ్ దగ్గర ఉంది. 24 రాష్ట్రాలకు, ఎనిమిది మెట్రోపాలిటిన్ నగరాలలో చెందిన డేటాను దొంగతనం చేసి అమ్ముతున్నారు. గుజరాత్(Gujarat)లోని 4.5 లక్షల మంది ఉద్యోగుల డేటా వీరి దద్గర ఉంది. నిందితుడి దగ్గర బైజూస్, వేదాంత సంస్థల డేటా కూడా లీకైనట్టు పోలీసులు తెలిపారు. వీటితో పాటు 9,10,11,12 తరగతుల విద్యార్థుల డేటా, పాన్ కార్డు, క్రెడిట్‌కార్డు, డెబిట్ కార్డు, ఇన్సూరెన్స్, ఇన్‌కమ్‌టాక్స్, డిఫెన్స్ డేటా కూడా చోరీకి గురైంది. 1.84 లక్షల మంది క్యాబ్ వినియోగదారుల డేటాను గ్యాంగ్ దొంగలించింది. బుక్ మై షో, ఇన్‌స్టాగ్రామ్, జొమాటో, పాలసీ బజార్ నుంచి డేటాను దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. మహారాష్ర్టలో అత్యధికంగా నాలుగు కోట్ల మంది డేటానో చోరి చేయగా, హైదరాబాద్ నగరానికి చెందిన కోటీ మంది డేటాను వినయ్ భరద్వాజ్ చోరీ చేసినట్టు పోలీసులు కనుగొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రెండున్నర కోట్ల మంది డేటా కూడా వీరి దగ్గర ఉంది. సైబరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చిన డేటా లీక్ కేసు దేశ వ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వర్గాలు దర్యాప్తులో భాగమయ్యాయి. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇందులో మనీలాండరింగ్ కోణం కూడా ఉండవచ్చన్నది ఈడీ భావన. డేటా చోరీలో బ్యాంక్, కాల్ సెంటర్లలోని ఉన్నత స్థాయి ఉద్యోగుల పాత్ర ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.