ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరగా చేసుకొని పెద్ద ఎత్తున డబ్బులు లూటీ చేస్తున్నారు కొందరు సైబర్ కేటుగాళ్లు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. వారిని ఈజీగా ముగ్గులోకి దింపి ఖాతాల్లోంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు.
ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరగా చేసుకొని పెద్ద ఎత్తున డబ్బులు లూటీ చేస్తున్నారు కొందరు సైబర్ కేటుగాళ్లు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. వారిని ఈజీగా ముగ్గులోకి దింపి ఖాతాల్లోంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల పట్ల ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా..నిలువుదోపిడీ చేస్తారు. ఆన్ లైన్ నేరాలను కట్టడి చేయడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నా..అక్రమాలకు అడ్డుకట్టపడటం లేదు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకోవడం, పిన్ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేయడం, రుణయాప్‌ల పేరుతో తోచినంత లాగేయడం, ఆన్‌లైన్ పెట్టుబడి పెట్టాలంటూ మోసాలకు పాల్పడటం..ఇలా మోసాలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఏకంగా 8 నెలల్లో రూ.707 కోట్లమేర మోసాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. గత ఏడాది రాష్ట్రంలో 16,339 సైబర్ నేరాల్లో 15 వేల వరకు ఆర్థిక మోసాలే నమోదయ్యాయి. ముఖ్యంగా అయిదు నేరవిధానాల ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్థికమోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిపుణులు గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఒక్క తెలంగాణలోనే 40 శాతానికిపైగా ఉన్నాయి. తెలంగాణలో సైబర్ నేరస్థులు ఎనిమిది నెలల్లో రూ.707.25 కోట్లు మోసానికి పాల్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. అంటే రోజూ రూ.3 కోట్లు మోసం చేస్తున్నారన్నమాట. అలాంటి సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీపులు..
ఏదైనా వాహనం లేదా వస్తువును అమ్మకానికి పెట్టినట్లు వెబ్‌సైట్లలో ప్రకటనలిస్తారు. కొనుగోలుకు ఆసక్తిచూపే వారితో వాహనం పలానా చోట పార్కింగ్‌లో ఉందని.. రవాణా ఛార్జీలు పంపిస్తే చాలు మీరు కోరిన ప్రదేశానికి పంపిస్తామని మాయ మాటలు చెబుతున్నారు. అలా రూ.వందలతో మొదలుపెట్టి వీలైనంత వరకు కొట్టేస్తున్నారు. అలాగే పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట సందేశాలు పంపి స్పందించిన వారికి టాస్క్‌లు ఇస్తున్నారు. తమ వెబ్‌సైట్‌లో వీడియోలు పరిశీలించి రేటింగ్ ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బులొస్తాయని నమ్మబలుకుతారు. ముందు కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టించి టాస్క్‌ను పూర్తి చేస్తే భారీ లాభం ఇస్తున్నారు. దీంతో వారు మరింత పెట్టుబడి పెడుతున్నారు. లక్షలు పెట్టాక మోసం చేస్తున్నారు. మరికొన్ని సార్లు ఫోన్ చేసి విదేశాల నుంచి మీకో పార్సిల్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ కస్టమ్స్ అధికారులకు అప్పగించామని చెబుతున్నారు. కొద్దిసేపటికే కస్టమ్స్ అంటూ మరొకరు ఫోన్ చేసి అరెస్ట్ వారంట్ జారీ అయిందని చెబుతున్నారు. న్యాయపరమైన చిక్కులు తప్పిస్తామంటూ రూ.లక్ష నుంచి వీలైనంత మేరకు వసూలు చేస్తున్నారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను అప్‌గ్రేడ్ చేస్తామని బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్లు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. బ్యాంకులు నేరుగా ఫోన్ చేసి క్రెడిట్ లేదా డెబిట్ వివరాలు అడిగే పరిస్థితి ఉండదు. ఈ విషయంలో ఏ మాత్రం అప్రమంత్తంగా లేకపోయినా... ఆన్‌లైన్ బ్యాంకింగ్ వివరాలను తీసుకొని ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఆన్ లైన్ వ్యవహారంలో స్వయం నియంత్రణ అవసరమంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.