కామంతో కళ్లు మూసుకుపోయి ఓ తండ్రి.. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. తండ్రీకూతుళ్ల బంధానికి మచ్చతెచ్చే ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో జరిగింది. రక్తం బంధాన్ని మరిచి..తల్లిలేని సమయంలో కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.

కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. తండ్రీకూతుళ్ల బంధానికి మచ్చతెచ్చే ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో జరిగింది. రక్త బంధాన్ని మరిచి..తల్లిలేని సమయంలో కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. పెద్దిరాజు అనే ఓ తాపీ మేస్త్రీ.. ఇస్నాపూర్‌‎లోనే ఉంటూ.. తన వద్దకు కూలీ పనికి వచ్చే ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే..తాపీ మేస్త్రీ పెద్దిరాజు..సదరు మహిళ కూతురిపైనా కన్నేశాడు. ఇటీవల.. ఇంట్లో తల్లిలేని సమయం చూసి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు పటాన్ చెరు పోలీసులు పెద్దిరాజుపై పోక్సో కేసు నమోదు చేశారు.

Updated On 20 Jan 2024 2:14 AM GMT
Ehatv

Ehatv

Next Story