CPI Narayana : కేసీఆర్, జగన్ భేటీ వ్యూహంలో భాగమే
ఏపీ సీఎం వైఎస్ జగన్(CM Jagan), బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) భేటీ వ్యూహంలో భాగమేనని సీపీఐ(CPI) నేత నారాయణ(Narayana) అన్నారు. గురువారం సీఎం జగన్ కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ భేటీపై నారాయణ స్పందిస్తూ.. ఇరువురి భేటీ వ్యూహంలో భాగమేనన్నారు. తెలంగాణలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు వారు గొడవ పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్(CM Jagan), బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) భేటీ వ్యూహంలో భాగమేనని సీపీఐ(CPI) నేత నారాయణ(Narayana) అన్నారు. గురువారం సీఎం జగన్ కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ భేటీపై నారాయణ స్పందిస్తూ.. ఇరువురి భేటీ వ్యూహంలో భాగమేనన్నారు. తెలంగాణలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు వారు గొడవ పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నీకు సహకరించాను.. ఇప్పుడు మీరు సహకరించండి అని అడగడానికే జగన్ వచ్చాడని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 2023 ఎన్నికల్లో సీపీఐ(CPI), సీపీఎం(CPM) కలిసి పని చేయాలని అనుకున్నామని.. నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయిందన్నారు.
పార్లమెంట్‌పై(Parliament) దాడి జరిగితే సమాధానం చెప్పలేక ఎంపీలను సస్పెండ్ చేశారని విమర్శించారు. దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని.. ఇండియా కూటమి(INDIA Alliance) బలపడుతోందన్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి తమకు ఆహ్వానం వచ్చిందని.. కానీ వెళ్లడం లేదన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనకూడదని.. కానీ ఆయన వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల కోసమే రామ మందిర నిర్మాణమని ఆరోపించారు.