ఆ విమానం(Flight) బ్యాంకాక్‌(Bangkok) వెళ్లాలి.. కానీ అనుకోకుండా అది ఢిల్లీలో(Delhi) ల్యాండైంది. ఎదో సాంకేతిక కారణంతో ల్యాండ్‌ అయిందనుకుంటే పొరపాటే.. కాదు.. విమానంలో ఇద్దరు భార్యాభర్తలు(Wife & Husband) గొడవ పడ్డ కారణంగా ఢిల్లీలో విమానం దిగింది. బ్యాంకాక్‌ వెళ్తున్న విమానం ఢిల్లీలో ల్యాండ్‌ అయింది. స్విట్జర్లాండ్‌(Switzerland) నుంచి బ్యాంకాక్‌ వెళ్తున్న లుఫ్తాన్సా(Lufthansa) విమానంలో ఓ జంట తగువులాడుకుంది. దీంతో పైలట్(Pilot) విమానాన్ని దారిమళ్లించి ఢిల్లీలోని ఇందిరాగాంధీ(Indira gandhi) అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపారు. మీడియా కథనాల ప్రకారం.. తన భర్త తనను బెదిరిస్తున్నాడని పైలట్‌కు భార్య ఫిర్యాదు చేసింది.

ఆ విమానం(Flight) బ్యాంకాక్‌(Bangkok) వెళ్లాలి.. కానీ అనుకోకుండా అది ఢిల్లీలో(Delhi) ల్యాండైంది. ఎదో సాంకేతిక కారణంతో ల్యాండ్‌ అయిందనుకుంటే పొరపాటే.. కాదు.. విమానంలో ఇద్దరు భార్యాభర్తలు(Wife & Husband) గొడవ పడ్డ కారణంగా ఢిల్లీలో విమానం దిగింది. బ్యాంకాక్‌ వెళ్తున్న విమానం ఢిల్లీలో ల్యాండ్‌ అయింది.

స్విట్జర్లాండ్‌(Switzerland) నుంచి బ్యాంకాక్‌ వెళ్తున్న లుఫ్తాన్సా(Lufthansa) విమానంలో ఓ జంట తగువులాడుకుంది. దీంతో పైలట్(Pilot) విమానాన్ని దారిమళ్లించి ఢిల్లీలోని ఇందిరాగాంధీ(Indira gandhi) అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపారు. మీడియా కథనాల ప్రకారం.. తన భర్త తనను బెదిరిస్తున్నాడని పైలట్‌కు భార్య ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని సిబ్బందిని, పైలట్‌ను కోరింది. దీంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ATC) నుంచి అనుమతి తీసుకొని ఢిల్లీలో ల్యాండ్‌ చేశాడు. విమానం నుంచి ఆ జంటను దింపివేశారు.. ఆ జంటతో అధికారులు(Officials) మాట్లాడినట్లు తెలిసింది. ఆ తర్వాత బ్యాంకాక్‌ బయల్దేరి వెళ్లిపోయింది. అయితే ఈ విమానం పాకిస్తాన్‌లో(Pakistan) దిగాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అక్కడ దిగలేకపోయింది. ఈ మధ్య కాలంలో విమానంలో తరుచూ కొందరు గొడవపడుతున్నారు. దీంతో అక్కడక్కడా విమానాలు దారి తప్పుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఈజిప్ట్(Egypt) నుంచి ఢిల్లీ వెళ్లిన విమానంలో సీట్లను ఓ ప్రయాణికుడు ధ్వంసం చేసి.. తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated On 29 Nov 2023 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story