అసెంబ్లీ(Assembly) ఎన్నికల్లో హస్తవాసి మారిపోతుందా..? ఈసారైనా మ్యాజిక్ ఫిగర్(Magic figure) దాటి పవర్‎లోకి వస్తామా? అన్నదానిపై కాంగ్రెస్(Congress) పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు రేపు వెలువడబోయే ఫలితాలపై(Results) అభ్యర్థులు, నేతలు, కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమకు అనుకూలంగా పోలింగ్(Polling) సరళి ఉండటం, ఎగ్జిట్ పోల్స్(Exit polls) కూడా సానుకూలత వ్యక్తం చేయడంపై లెక్కలు కడుతున్నారు. ఇక కొంత మంది పార్టీ అభ్యర్థులు..సీఎం కేసీఆర్‎కు (CM KCR) టచ్‎లో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. కర్నాటక(Karnataka) డిప్యూటీ సీఎం డికే శివకుమార్‎ను(DK Shiva Kumar) రంగంలోకి దింపింది. తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నిలక కౌంటింగ్(Counting) మరికొన్ని గంటల్లోనే మొదలు కానుంది. దీంతో ఎన్ని స్థానాల్లో గెలుస్తాం..ఎక్కడెక్కడ గెలుస్తాం, ఓడిపోయే స్థానాలేంటి? దక్షిణ తెలంగాణలో నిజంగానే స్వీప్ చేస్తున్నామా? ఉత్తర తెలంగాణలో బలం పెరిగిందా? హైదరాబాద్(Hyderabad) శివారు ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో గట్టి పోటి ఇచ్చే అవకాశం ఉంది.

అసెంబ్లీ(Assembly) ఎన్నికల్లో హస్తవాసి మారిపోతుందా..? ఈసారైనా మ్యాజిక్ ఫిగర్(Magic figure) దాటి పవర్‎లోకి వస్తామా? అన్నదానిపై కాంగ్రెస్(Congress) పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు రేపు వెలువడబోయే ఫలితాలపై(Results) అభ్యర్థులు, నేతలు, కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమకు అనుకూలంగా పోలింగ్(Polling) సరళి ఉండటం, ఎగ్జిట్ పోల్స్(Exit polls) కూడా సానుకూలత వ్యక్తం చేయడంపై లెక్కలు కడుతున్నారు. ఇక కొంత మంది పార్టీ అభ్యర్థులు..సీఎం కేసీఆర్‎కు (CM KCR) టచ్‎లో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. కర్నాటక(Karnataka) డిప్యూటీ సీఎం డికే శివకుమార్‎ను(DK Shiva Kumar) రంగంలోకి దింపింది.

తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నిలక కౌంటింగ్(Counting) మరికొన్ని గంటల్లోనే మొదలు కానుంది. దీంతో ఎన్ని స్థానాల్లో గెలుస్తాం..ఎక్కడెక్కడ గెలుస్తాం, ఓడిపోయే స్థానాలేంటి? దక్షిణ తెలంగాణలో నిజంగానే స్వీప్ చేస్తున్నామా? ఉత్తర తెలంగాణలో బలం పెరిగిందా? హైదరాబాద్(Hyderabad) శివారు ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో గట్టి పోటి ఇచ్చే అవకాశం ఉంది..ఇలాంటి అంశాలపై లోతుగా చర్చించి, విశ్లేషణలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. పీసీసీ చీఫ్(PCC Chief) నుంచి గ్రామ స్థాయి వరకు ఇదే పరిస్థితి..అదే ఉత్కంఠ కనపడుతోంది.

మరోవైపు రేపు వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై(Election results) కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.(Rahul Gandhi).ఎన్నికల సరళితోపాటు గెలవబోయే స్థానాలకు సంబంధించి ఆరా తీసినట్టు సమాచారం. శనివారం(Saturday) సాయంత్రం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్‎లో(Zoom meeting) మాట్లాడారు. ఎన్నికల ఫలితాలతోపాటు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.

మరోవైపు హైకమాండ్(High command) ఆదేశాలతో ఫలితాల సందర్భంగా పార్టీ అభ్యర్థుల సమన్వయం(Coordination), పర్యవేక్షణ కోసం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, మంత్రి జార్జ్‎లు(George) శనివారం సాయంత్రమే హైద్రాబాద్ తాజ్ కృష్ణకు(Taj Krishna) చేరుకున్నారు. కొంత మంది పార్టీ అభ్యర్థులు..సీఎం కేసీఆర్‎కు టచ్‎లో ఉన్నారన్న వార్తలను ఆయన ఖండించారు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదన్న ఆయన.. క్యాంపు రాజకీయాలు(Camp politics) చేయాల్సిన అవసరం రాదని అన్నారు. భారీ మెజార్టీతోనే(Majority) కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని డీకే ధీమా వ్యక్తం చేశారు.

Updated On 2 Dec 2023 6:34 AM GMT
Ehatv

Ehatv

Next Story