ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. సీనియర్ నేత అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఫైనల్ చేసింది. కాంగ్రెస్ ముఖ్య నేతలు వీరికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో..వీరిద్దరూ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఇక..ఈ నెల 18వ తేదీన నామినేషన్లకు ఆఖరి గడువు. జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల(Mlc Candidates)ను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం(Congress Party leadership) ఖరారు చేసింది. సీనియర్ నేత అద్దంకి దయాకర్(Addanki Dayakar), బల్మూరి వెంకట్(Balmuri Venkat)పేర్లను ఫైనల్ చేసింది. కాంగ్రెస్ ముఖ్య నేతలు వీరికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో..వీరిద్దరూ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఇక..ఈ నెల 18వ తేదీన నామినేషన్లకు ఆఖరి గడువు. జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరూ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లను త్యాగం చేశారు. తుంగతుర్తి నుంచి గత ఎన్నికల్లో టిక్కెట్ రాకపోయినా పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసిన అద్దంకి దయాకర్తో పాటు ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ లకు కూడా ఎమ్మెల్సీ అవకాశం కల్పించింది. బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే కోటా కింద ఇద్దరి పేర్లు ఖరారయినట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండటంతో వీరి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.